
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల గడువు మరో 20 నెలలు ఉన్నా… అప్పుడే ఎలక్షన్ వాతావరణం కనిపిస్తోంది. 2018లానే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారంతో విపక్షాలు అలర్ట్ అయ్యాయి. జోరుగా జనంలోకి వెళుతున్నాయి. తమ గెలుపోటములపై పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ కూడా ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలు చుట్టేస్తున్నారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతులు కలిపారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించే బాధ్యతలను పీకీ తన భుజాన వేసుకున్నారు. వందల సంఖ్యలో ఉండే తన టీమ్ ను పీకీ అప్పుడే రంగంలోకి దించారు. తనదైన శైలిలో ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వే ఫలితాలను సమీక్షిస్తూ… ఏం చేయాలి? ఎలా ముందుకు సాగాలి? తదితర సలహాలను కేసీఆర్ కు ఇస్తున్నారు. తాజాగా కేసీఆర్ కు పీకే తన నివేదికను సమర్పించారు. అందులో సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read More : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్, ఈడీ శాఖల మధ్య వార్?
టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పీకే టీమ్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అధికారిక విధుల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోకుండా చూడాలని, రెండు సార్లు ప్రభుత్వ హయాంలో పదవులు లభించని పాత నాయకులకు న్యాయం చేయాలని సూచించిందట.
అధికారుల బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని పీకే టీమ్ రిపోర్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. జిల్లా, జోన్, మల్టీ జోన్, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, బీజేపీ దూకుడును, ప్రచారాన్ని ఎదుర్కోవడానికి సోషల్ మీడియా సెల్ ను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వరాదని పీకే ఖరాఖండిగా చెప్పేశారట. అలా చేయకపోతే ఓటమి ఖాయమని స్పష్టం చేశారట. సీనియర్, జూనియర్ నేతల మధ్య అంతరాన్ని తగ్గించాలని సూచించిందట. సంక్షేమ పథకాలను ప్రజల్లో హైలైట్ చేయాలని కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ టీమ్ చెప్పిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి ..
- సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం
- ఎంపీ అర్వింద్ కు కవిత దిమ్మతిరిగే షాక్. .
- చినజీయర్ పై కసి తీర్చుకున్న కేసీఆర్!
- తెలంగాణ ఆప్ చీఫ్ గా కోదండరామ్?
- మంత్రుల సామూహిక రాజీనామా? ఏపీలో సంచలనం..
5 Comments