
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితం వస్తే ప్రెసిడెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారేవి. యూపీలో బీజేపీ ఓడిపోతే విపక్షాలన్ని ఏకమై రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తాయనే చర్చ జరిగింది. ఎన్డీఏ నుంటి జేడీయూను బయటికి తీసుకువచ్చి… నితీష్ కుమార్ ను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కాని యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ విక్టరీ కొట్టడంతో ప్రెసిడెంట్ ఎన్నికల హీట్ తగ్గిపోయింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో త్వరలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాయావతిని రాష్ట్రపతిని చేసేందుకు రంగం సిద్ధమైందంటూ వార్తలు వస్తున్నాయి. బీజేపీనే మాయావతిని రాష్ట్రపతి చేయాలని ప్లాన్ చేసిందని అంటున్నారు. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను బీఎస్పీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది.తాజాగా తనపై వస్తున్న వార్తలపై బీఎస్పీ అధినేత్రి స్పందించారు.
రాష్ట్రపతి పదవి అనేది తన కలలో కూడా లేని అంశమని తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్ కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశాయని ఆరోపించారు. యూపీలో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పడకపోతే బెహన్‌జీని రాష్ట్రపతిని చేస్తామని వారు ప్రచారం చేశారని, దీంతో ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెట్టారని మాయావతి విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ ఘోర పరాజయంపై సమీక్ష నిర్వహించిన మాయావతి.. రాష్ట్రపతి పదవి వార్తలపై స్పందించారు. తాను ఒకవేళ రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తే అక్కడితో పార్టీ అంతమైనట్టేనని అన్నారు. బీజేపీ సహా ఏ పార్టీ ఆఫర్ చేసినా రాష్ట్రపతి పదవిని అంగీకరించబోనన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం కూడా అత్యున్నత పదవిని తిరస్కరించారని మాయావతి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మాయావతి చెప్పారు.
ఇవి కూడా చదవండి ..
- యాదాద్రిలో కోమటిరెడ్డికి అవమానం?
- మునుగోడుపై పీకే టీమ్ రిపోర్ట్.. కొత్త నేతకే టికెట్?
- వాళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా… కేసీఆర్ కు పీకే టీమ్ రిపోర్ట్!
- సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం
- ఎంపీ అర్వింద్ కు కవిత దిమ్మతిరిగే షాక్. .