
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీహార్ లో సంచలన ఘటన జరిగింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. తన సొంత ఊరు బక్తియార్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం నితీశ్ పాల్గొనగా, ఓ వ్యక్తి పోలీసులను దాటేసుకుంటూ వెళ్లి దాడికి పాల్పడ్డాడు. దుండగుడి చర్యకు సీఎం నితీశ్ బిత్తరపోగా, పోలీసులు ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సంచలనంగా మారింది.
బక్తియార్ పూర్ పర్యటనలో భాగంగా సీఎం నితీశ్ స్వాతంత్రయోధులకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం బీహార్ నుంచి పోరాడిన స్వాతంత్య్రోద్యమ పోరాట యోధుడు శిల్‌భద్ర యాజి విగ్రహం బక్తియార్‌పూర్ పట్టణంలో ఉంది. బక్తియార్‌పూర్‌లోని ఆస్పత్రి ప్రాంగణంలో గల శిల్ భద్రయాజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సమయంలో సీఎం నితీశ్‌పై దాడి జరిగింది.
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్లగా, ఫిరోజ్ పూర్ లో ఆయన భద్రతలో భారీ వైఫల్యం తలెత్తింది. మళ్లీ రెండు నెలల వ్యవధిలో ఓ పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఏకంగా దాడి జరగడం కలకలం రేపుతున్నది.ముఖ్యమంత్రిపై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని గురించి విచారిస్తున్నారు. సీఎంను కొట్టిన వ్యక్తికి మతిస్థిమితం లేనట్లుగా కొన్ని చానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
ఇవి కూడా చదవండి ..
- వాళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా… కేసీఆర్ కు పీకే టీమ్ రిపోర్ట్!
- ఎంపీ అర్వింద్ కు కవిత దిమ్మతిరిగే షాక్. .
- చినజీయర్ పై కసి తీర్చుకున్న కేసీఆర్!
- తెలంగాణ ఆప్ చీఫ్ గా కోదండరామ్?
- మంత్రుల సామూహిక రాజీనామా? ఏపీలో సంచలనం..
3 Comments