
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయి ఆధ్మాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభు దర్శనాలకు వేళైంది. సోమవారం నుంచి ప్రధానాలయ ఉధ్ఘాటన పూజలు, గర్భాలయంలో నృసింహుల మూల విరాట్ దర్శనాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఆరు సంవత్సరాల తర్వాత స్వయంభు స్వామివారు గర్భాలయంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వందల సంవత్సరాల అనంతరం ఆధారశిల నుంచి శిఖరం వరకు, అష్టభుజి ప్రాకార మండపాలు, సింహయాళీ, కాకతీయ స్తంభాలు, పురాణ ఇతిహాస విశిష్టతలను రాతిశిలలపై పదిలపరుస్తూ ఎన్నో విశేషాలతో యాదాద్రి కొండపై పాంచనరసింహుల ఆలయాన్ని పునర్నిర్మించారు.
Read More : వాళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా… కేసీఆర్ కు పీకే టీమ్ రిపోర్ట్!
యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ పున:ప్రారంభం పనుల కోసం చినజీయర్ ముందునుంచి అన్నీ తానై చూసుకున్నారు. ప్రముఖ అర్కిటెక్చర్ ఆనందసాయికి బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రికి సూచించింది కూడా చినజీయర్ స్వామే. అలా యాదాద్రీశ్వరుని ఆలయం పనులు చూసుకున్న చినజీయర్‌కు కనీసం ఆహ్వానాన్ని కూడా పంపలేదు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆలయ పున:నిర్మాణ కార్యక్రమంలో చినజీయర్ పేరు లేకపోవడం విస్తుపోయేలా చేస్తోంది. చినజీయర్ కు అపర భక్తుడిగా పేరొందిన సీఎం కేసీఆర్.. ఆయనపై గుర్రుగా ఉన్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. సమతామూర్తి వేడుకల సందర్భంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. శ్రీరామనగరంలో ప్రతిష్టించిన శిలాఫలకం మీద కేసీఆర్ పేరు లేదు. దీంతో చినజీయర్ పై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే యాదాద్రికి ఆయనకు ఆహ్వానం అందలేదంటున్నారు.
Read More : ఎంపీ అర్వింద్ కు కవిత దిమ్మతిరిగే షాక్. .
మరోవైపు చినజీయర్ నిర్ణయించిన ముహూర్తం ప్రకారమే యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. జీయర్ స్వామికి ప్రత్యేక ఆహ్వానం పంపలేదన్నారు. అందరూ ఆహ్వానితులేనన్నారు, శిలాఫలకం ఏర్పాటు చేయలేదని తెలిపారు. బాలాలయం నుంచి ప్రధానాలయానికి స్వామివారిని తీసుకెళ్లి.. గర్భాలయంలో అధిష్టింపజేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు శోభా యాత్రలో పాల్గొంటారని చెప్పారు. భక్తులందరికి అన్నప్రసాదం అందేలా ఏర్పాట్లు చేస్తామని గీతారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం
- తెలంగాణ ఆప్ చీఫ్ గా కోదండరామ్?
- మంత్రుల సామూహిక రాజీనామా? ఏపీలో సంచలనం..
- టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్, ఈడీ శాఖల మధ్య వార్?
- తెలంగాణ ప్రజలు నూకలు తినాలా.. ఇంత అవమానమా?
2 Comments