
క్రైమ్ మిర్రర్, నిజామాబాద్ : తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీకి కళ్లెం వేసేలా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ బలంగా ఉందని భావిస్తున్న ప్రాంతాల నుంచే తమ ఆపరేషన్ ప్రారంభించింది. నిజామాబాద్ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడే ఎంపీ ధర్మపురి అర్వింద్ కు షాకిచ్చింది ఎమ్మెల్సీ కవిత.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , ఎమ్మెల్యే బిగాల గణేష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరార నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన బీజేపీ పార్టీ 39 వ డివిజన్ కార్పొరేటర్ నిచ్చేంగు లత క్రిష్ణ, 44 వ డివిజన్ కార్పొరేటర్ బైకాన్ సుధా మధు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ కవిత. ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు కారెక్కడం ఎంపీ అర్వింద్ కు కోలుకోలేని దెబ్బ అంటున్నారు.
Read More : తెలంగాణ ప్రజలు నూకలు తినాలా.. ఇంత అవమానమా?
అటు వరి ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమానికి సిద్ధమవుతోంది టీఆర్ఎస్. అయితే వరి కొనుగోళ్ల విషయంలోనూ బీజేపీకి షాక్ తగిలింది. ధాన్యం కొనుగోలు పై బీజేపీ ఎంపిపి తీర్మానం చేయడం నిజామాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోలపు రజిని (బీజేపీ) అధ్యక్షత జరిగిన సర్వ సభ్య సమావేశంలో కేంద్రమే వడ్లు కొనాలని తీర్మానం చేశారు .యసంగిలో రైతులు సాగుచేసిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఏక గ్రీవ తీర్మానం చేసి తీర్మానం కాపీని ప్రధానమంత్రికి పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి ..
- వాళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా… కేసీఆర్ కు పీకే టీమ్ రిపోర్ట్!
- సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం
- చినజీయర్ పై కసి తీర్చుకున్న కేసీఆర్!
- తెలంగాణ ఆప్ చీఫ్ గా కోదండరామ్?
- మంత్రుల సామూహిక రాజీనామా? ఏపీలో సంచలనం..
4 Comments