
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే రెండున్నర ఏళ్లకు మంత్రులను మారుస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దీంతో జగన్ పాలన సగం పూర్తైనప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్నాయి. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై సీఎం జగన్ తుది అంచనాకు వచ్చారని, జాబితా కూడా సిద్ధమైందనే ప్రచారం జరిగింది. గత నాలుగు నెలలుగా రోజూ మంత్రివర్గ విస్తరణపైనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజునే కొత్త మంత్రి వర్గంకొలువుదీరనుందని సమాచారం.
Read More : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్, ఈడీ శాఖల మధ్య వార్?
ప్రస్తుత మంత్రులందరికీ త్వరలోనే ప్రత్యేక విందు ఇస్తున్నారట సీఎం జగన్. ఆ విందు తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు వీలు కల్పిస్తూ ప్రస్తుత మంత్రివర్గంలోని మంత్రులందరితో మూకుమ్మడి రాజీనామాలు చేయించనున్నారని సమాచారం. పదవి కోల్పోయిన వారెవరూ డిసప్పాయింట్ కావొద్దని.. వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని.. మాజీలు కాబోయే వారిని ఓదార్చేందుకే ఆ డిన్నర్ మీటింగ్ అని అంటున్నారు. విందు భేటీ తర్వాత ముఖ్యమంత్రి కొత్త కేబినెట్‌కి తుది రూపం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
కొత్త కేబినెట్ లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి వర కూర్పులో పాత పద్దతులనే కొనసాగిస్తారని అంటున్నారు. గతంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏకంగా ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతారని అంటున్నారు. పాత కాబినెట్ లో ఇచ్చిన విధంగానే కొత్త కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. ఈసారి కూడా హోం శాఖను మహిళకే అప్పగించనున్నట్లు తెలిసింది.
Read More : తెలంగాణ ప్రజలు నూకలు తినాలా.. ఇంత అవమానమా?
మరో వైపు మంత్రి పదవులు ఆశిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తనను మళ్ళీ మంత్రి వర్గంలోకి తీసుకున్నా ఆర్థిక శాఖ మాత్రం వద్దు అని ముఖ్యమంత్రి వేడుకుంటున్నారని అంటున్నారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ తీరును బట్టి ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్తారా, లేదా అనే విషయంలోనూ క్లారిటీ వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఆరోవేలుతో సమానమైన మంత్రులను మార్చడం వలన ప్రయోజనం ఉండదని, మారిస్తే ముఖ్యమంత్రిని మార్చాలని విపక్షాలు సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి ..
- వాళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా… కేసీఆర్ కు పీకే టీమ్ రిపోర్ట్!
- సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం
- ఎంపీ అర్వింద్ కు కవిత దిమ్మతిరిగే షాక్. .
- చినజీయర్ పై కసి తీర్చుకున్న కేసీఆర్!
- తెలంగాణ ఆప్ చీఫ్ గా కోదండరామ్?