
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనేది కేసు. ఆ స్థలంలో శివాలయం కట్టారనేది ఆరోపణ. కేసులో పది మందికి నోటీసులు ఇచ్చారు. అందులో, ఆలయంలోని శివలింగం కూడా ఉంది. అక్కడితో ఆగిపోలేదు యవ్వారం. కోర్టు విచారణకు రావాల్సిందిగా హుకూం జారీ చేయడంతో.. శివలింగాన్ని పెకిలించి మరీ రిక్షాలో కోర్టుకు తీసుకురావడం మరింత సంచలనం. రాయ్‌గఢ్‌లో జరిగిన ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఘటనపై హిందుత్వ సంఘాలు మండిపడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లో భూఆక్రమణ ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వగా.. శివుడితో పాటు మరో 9 మంది విచారణకు హాజరయ్యారు. రాయ్‌గఢ్‌కు చెందిన సుధా రజ్వాడే ఇటీవల బిలాస్‌పుర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహసీల్దార్ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ అనంతరం 10 మందికి నోటీసులిచ్చారు. ఈనెల 25న జరిగే విచారణకు హాజరై.. భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
విచారణకు హాజరుకాకపోతే.. చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో శివలింగంతో సహా నోటీసులు అందుకున్నవారంతా కోర్టు విచారణకు హాజరయ్యారు. శివలింగాన్ని అలా రిక్షాలో తీసుకువచ్చిన దృశ్యాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. ఈ విషయంలో క్షణాల్లో దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. హిందుత్వ సంస్థలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివుడికి నోటీసులు ఇచ్చిన ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం
- ఎంపీ అర్వింద్ కు కవిత దిమ్మతిరిగే షాక్. .
- చినజీయర్ పై కసి తీర్చుకున్న కేసీఆర్!
- తెలంగాణ ఆప్ చీఫ్ గా కోదండరామ్?
- మంత్రుల సామూహిక రాజీనామా? ఏపీలో సంచలనం..