
హైదరాబాద్ పేరు చెప్పగానే మొదటగా వినిపించేది బిర్యానీనే. దాని తర్వాత గుర్తుకు వచ్చేది ఇరానీ చాయ్. ఈ రెండింటికి హైదరాబాద్ తో విడదీయరాని బంధం ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీతోపాటు ఇరానీ చాయ్ కి కూడా అంతర్జాతీయ స్ఠాయిలో గుర్తింపు ఉంది. ఇరానీ చాయ్ పేరు చెబితే ఎవరైనా రిలాక్స్ కావాల్సిందే అంటారు. చాయ్ అలవాటు ఉన్నవారు నేరుగా ఇరానీ చాయ్ తాగితేనే కాని వారు ఒత్తిడి నుండి దూరం కాలేరని చెబుతారు. ఇంతలా ఇరానీ చాయ్‌కి హైదారాబాద్ వాసులు ఎడిక్ట్ అయిపోయారు. అయితే ఈ చాయ్ ప్రియులకు హోటల్ యజమానులు షాక్ ఇచ్చారు. ప్రతి చాయ్ కప్పుపై 5 పెంచుతూ.. ఒక్కో కప్పు ధరను 20 రూపాయలు చేశారు. ప్రస్తుతానికి ఇరానీ చాయ్ 12 రూపాయల నుండి 15 రూపాలయలు ఉండగా దాన్ని ఏకంగా 20 రూపాయలు చేశారు.
మార్కెట్‌లో టీపొడి ధరలు పెరుగుతుండడంతో పాటు నిత్యవసరాల ధరలు, గ్యాస్ రేట్లు కూడా పెరగడంతోపాటు కరోనా నష్టాల నుండి బయటపడేందుకు చాయ్ రేట్లను పెంచుతున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇరానీ చాయ్ టీ పోడి ధర కిలో ధర ప్రస్తుత ధర కంటే రూ.200 అదనం కావడంతో కిలో ధర 500కు చేరుకున్నట్టు హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి తోడు గ్యాస్ ధరలు, కరోనా పరిస్థితుల ప్రభావం కూడా హోటల్స్ పై పడినట్టు వాపోతున్నారు. దీంతో ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నారు.