
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఎంతవరకైనా వెళతానంటున్నారు. ఇంతకాలం కేసీఆర్ కు సన్నిహితింగా ఉన్న ప్రముఖులు కూడా క్రమంగా ఆయనకు దూరమవుతున్నారు. ఇటీవల సమతా మూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పడిన వివాదంతో కేసీఆర్, చినజీయర్ స్వామిల మధ్య దూరం పెరిగిందనే చర్చ జరుగుతోంది.
Read More : జనాలకు కేసీఆర్ మరో షాక్? ఆర్టీసీ అదనపు వడ్డింపులు
చినజీయర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కొంతమంది తమ మధ్య కావాలనే విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు.అటు చినజీయర్ కూడా తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని చెప్పారు. అయితే చినజీయర్ తో పాటు జూపల్లి రామేశ్వర్ రావుకు కూడా కేసీఆర్ తో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. జూపల్లిని కేసీఆర్ దూరం పెట్టారని అంటున్నారు. దీంతో జూపల్లి రామేశ్వరరావు కూడా బీజేపీ పెద్దలతో టచ్ లోకి వెళ్లారని సమాచారం.
Read More : సీనియర్లకు హైకమాండ్ క్లాస్.. టీఆర్ఎస్ కుట్ర చేసిందా?
కేసీఆర్, జూపల్లి మధ్య విభేదాలు తీవ్రమైనట్లు తాజాగా జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి.సోమవారం యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఛానళ్లు ప్రత్యక్షప్రసారం చేశాయి. కానీ రామేశ్వర్ రావు గారి ప్రముఖ ఛానళ్లు అంతగా పట్టించుకోలేదు, ప్రాముఖ్యతను ఇవ్వలేదు. కాసేపు చూయించి ఇది మాది కాదు అన్నట్టుగా వదిలేశారు. ఇప్పుడు ఈ విషయమే సర్వత్రా చర్చనీయాంశమైంది. పలువురు మీడియా ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ విషయమై చర్చించుకుంటున్నారు.
Read More : రెండోసారి ఎన్నికల వ్యూహకర్త పీకే ప్రయత్నాలు ఫలించేనా..?
దీన్నిబట్టే రామేశ్వర్ రావు, కేసీఆర్ ల మధ్య విభేదాలు తలెత్తాయని అందుకే రామేశ్వర్ రావు ఛానళ్లలో మహా యాగానికి సంబంధించిన లైవ్ ప్రసారం కాలేదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతు న్నది. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పునర్ నిర్మాణం పూర్తయ్యింది. మంగళవారం ఆలయ పునర్ ప్రారంభం కానున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమాన్నైనా తప్పనిసరిగా ప్రత్యక్ష ప్రసారం చేసేవి. పైపెచ్చు టీఆర్ఎస్ సొంత మీడియాను మించి రామేశ్వర్ రావుకు చెందిన టీవీ ఛానళ్లు ప్రసారం చేసేవి.కాని జూపల్లికి సంబంధించిన ఛానెళ్లలో యాదాద్రి కనిపించకపోవడంతో త్వరలోనే టీవీ9, 10టీవీ ఛానెళ్లలో టీఆర్ఎస్ వార్తలు కనిపించకపోవచ్చని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- ముందస్తు ఎన్నికలు రావట.. సర్వేలు చేయిస్తున్నారట? ఏదో తేడా కొడుతోంది కేసీఆర్..
- వైసీపీ నేతలతో బాలకృష్ణ పీఏ పేకాట..
- ఈ సారి కేసీఆర్ నల్గొండ నుండే బరిలోకి..? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
- ప్రశాంత్ కిషోర్ ఫీజు ఎంతో తెలుసా? వామ్మో ఇది నిజమా?
- టీఆర్ఎస్ కు 29 సీట్లు.. కేసీఆర్ షాకింగ్ సర్వే!