
క్రైమ్ మిర్రర్, అమరావతి : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ అరెస్టయ్యారు. వైసీపీ నేతలతో కలిసి పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని నగరిగేర వద్ద కొందరు పేకాట ఆడుతున్నట్లు కర్ణాటక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడులు చేసిన పోలీసులు మొత్తం 19 మంది అరెస్ట్ చేశారు. ఇందులో హిందూపురంకు చెందిన పేకాటరాయుళ్లు దొరికారు. పట్టుబడ్డవారిలో వైసీపీ, టీడీపీలకు చెందినవారున్నారు. వారిలో బాలకృష్ణ పీఏగా పనిచేస్తున్న బాలాజీతో పాటు హిందూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి ఉన్నారు. నిందితులను కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరుపరిచారు.
Read More : జనాలకు కేసీఆర్ మరో షాక్? ఆర్టీసీ అదనపు వడ్డింపులు
వైసీపీ నేతలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ పేకాట ఆడటం చర్చనీయాంశమవుతోంది. నియోజకవర్గంలో వ్యక్తిగత పనుల కోసం పెట్టుకున్న వ్యక్తి ఇలా ప్రత్యర్థులతో సిట్టింగ్ వేయడంపై హిందూపురంలో ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ,టీడీపీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ వైరం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పీఏ వైసీపీతో కలిసిపోయి పేకాట ఆడటంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.
పీఏ వ్యవహారంలో బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు ఐదేళ్లకు పైగా బాలకృష్ణకు పీఏగా బాలాజీ వ్యవహరిస్తున్నాడు. ఆయన హిందూపురం వచ్చినప్పుడు అన్ని వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. బాలకృష్ణ లేని సమయంలో అక్కడి రాజకీయ వ్యవహారాలను కూడా బాలాజీ చక్కబెడుతున్నారు. బాలయ్యకు అత్యంత కీలకమైన వ్యక్తి అధికార పార్టీ నేతలతో పేకాట ఆడటం, ఆపై పోలీసులకు చిక్కడంపై విమర్శలు వస్తున్నాయి.
Read More : రెండోసారి ఎన్నికల వ్యూహకర్త పీకే ప్రయత్నాలు ఫలించేనా..?
గతంలో బాలకృష్ణ దగ్గర పనిచేసిన పీఏగా పనిచేసిన శేఖర్ వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. బాలకృష్ణ లేని సమయంలో టీడీపీ నేతలపై పెత్తనం చేయడమే కాకుండా పార్టీని గ్రూపులుగా విడగొట్టారని.. బాలయ్యపేరుతో అవినీతి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లే తిరుగుబావుటా ఎగురవేశారు. ఐదేళ్ల క్రితం ఈ వ్యవహారం బాగా చర్చనీయాంశమైంది. పీఏ తీరుతో బాలకృష్ణ కూడా విమర్శలెదుర్కొన్నారు. చివరకు చంద్రబాబు జోక్యంతో టీడీపీ కార్యకర్తలు చల్లబడ్డారు. ఆ వివాదం కారణంగా శేఖర్ ను తప్పించిన బాలకృష్ణ.. ఆయన స్థానంలో బాలాజీని నియమించుకున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- ఈ సారి కేసీఆర్ నల్గొండ నుండే బరిలోకి..? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
- ప్రశాంత్ కిషోర్ ఫీజు ఎంతో తెలుసా? వామ్మో ఇది నిజమా?
- టీఆర్ఎస్ కు 29 సీట్లు.. కేసీఆర్ షాకింగ్ సర్వే!
- త్వరలో ‘ద హైదరాబాద్ ఫైల్స్’..మరో సంచలనమేనా?
- ఆ గ్రామాలకు రైతు బంధు లేదు.. కేసీఆర్ సంచలన ఆదేశాలు
2 Comments