
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ద కశ్మీర్ ఫైల్స్ సినిమా మేనియా నడుస్తోంది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది ది కశ్మీర్ ఫైల్స్ సినిమా. అదే సమయంలో సినిమా చూట్టూనే వివాదాలు నడుస్తున్నాయి. బీజేపీతో పాటు హిందూ సంఘాలు సినిమాపై ప్రసంశల జల్లు కురిపిస్తుండగా.. కొన్ని వర్గాలు మాత్రం అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపిస్తున్నారు. తాజాగా ద కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే.. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరపైకి తెచ్చారని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. కశ్మీర్‌లో హిందూ పండిట్‌లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది చిత్రాలపై కాదని, రైతు సమస్యలపై చర్చ జరగాలని కేసీఆర్ అన్నారు.
అయితే ‘కశ్మీర్ ఫైల్స్’లాగా త్వరలోనే ‘హైదరాబాద్ ఫైల్స్’ కూడా వస్తుందని బీజేపీ జాతీయ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం.. టెర్రర్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు.నిజామాబాద్, బైంసా, నిర్మల్, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని మురళీధర్‌రావు మండిపడ్డారు. టీఆర్ఎస్, పోలీసులు ఎమ్ఐఎమ్‌కి సహకరిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో లవ్ జిహాద్ కేసులలో పురోగతి లేదని.. బోధన్‌లో హిందువులను అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా? లేదా పాకిస్థాన్‌లో ఉందా? అంటూ ప్రశ్నించారు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు.
మతోన్మాద, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్ అని.. హిందువుల ప్రాణాల, ఆస్తుల నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహమూద్ ఆలీ రోహింగ్యాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి హిందులు వలసలు ఎందుకు జరిగాయని నిలదీశారు. 1970 తర్వాత ఎందుకు హిందువుల సంఖ్య తగ్గిందో తెలియాలన్నారు మురళీధర్‌రావు.
ఇవి కూడా చదవండి ..
- వైసీపీ నేతలతో బాలకృష్ణ పీఏ పేకాట..
- ఈ సారి కేసీఆర్ నల్గొండ నుండే బరిలోకి..? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
- ప్రశాంత్ కిషోర్ ఫీజు ఎంతో తెలుసా? వామ్మో ఇది నిజమా?
- టీఆర్ఎస్ కు 29 సీట్లు.. కేసీఆర్ షాకింగ్ సర్వే!