
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : కొంత కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెగ హడావుడి చేస్తున్నారు. మంత్రులకు కూడా అపాయింట్ మెంట్లు ఇవ్వడం లేదనే విమర్శలు ఉన్న కేసీఆర్… ఏకంగా జిల్లాలు చుట్టేస్తున్నారు. పార్టీ నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ దూకుడుతో తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. పీకే టీమ్ కూడా తెలంగాణలో తిరుగుతుండటంతో కేసీఆర్ కోసం పీకే టీమ్ సర్వే చేస్తుందని తెలిసింది. తాజాగా ముందస్తు ఎన్నికలు, సర్వేలపై సంచలన ప్రకటన చేశారు సీఎం కేసీఆర్.
Rade More : సీనియర్లకు హైకమాండ్ క్లాస్.. టీఆర్ఎస్ కుట్ర చేసిందా?
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై కేసీఆర్ స్పష్టతను ఇచ్చారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్తే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉండేకాబట్టి వెళ్లామన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. తాము ప్రారంభించిన ప్రాజెక్టులు, పనులు మేం చేయాల్సి ఉందన్నారు. కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు కేసీఆర్.
పాలమూరు, సీతారామ పూర్తి కావాలి. తెలంగాణకు ఐటీ, పరిశ్రమల పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.. బజార్లో అరిచే వ్యక్తుల గురించి మాట్లాడనని చెప్పారు. కేసీఆర్ ఎప్పుడు మోసం చేయడన్నారు. ఏం చెప్పినామో అదే చేస్తామన్నారు. తొలిసారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు, ఇప్పుడు 95-105 సీట్ల మధ్య గెలుస్తామన్నారు. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 స్థానాల్లో మేం గెలుస్తామని రిపోర్టులో వచ్చిందని కేసీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- వైసీపీ నేతలతో బాలకృష్ణ పీఏ పేకాట..
- ఈ సారి కేసీఆర్ నల్గొండ నుండే బరిలోకి..? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
- ప్రశాంత్ కిషోర్ ఫీజు ఎంతో తెలుసా? వామ్మో ఇది నిజమా?
- త్వరలో ‘ద హైదరాబాద్ ఫైల్స్’..మరో సంచలనమేనా?
- రెండోసారి ఎన్నికల వ్యూహకర్త పీకే ప్రయత్నాలు ఫలించేనా..?
One Comment