
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరంలోని తార్నాక, ఉస్మానియా యూనివర్సిటీ, హబ్సిగూడ, అంబర్‌పేట, విద్యానగర్, రామంతపూర్, ఉప్పల్, ఘట్‌కేసర్, నాచారం, మల్లాపూర్, మలక్‌పేట, చైతన్యపురి, సరూర్ నగర్‌లలో భారీ వర్షం కురిసింది.
ఇప్పటికీ నగరంలోని పలుచోట్ల వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. సాయంత్రం అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో పలుచోట్ల కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లు తెలుస్తోంది. దీంతో వడగాల్పులు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనాలకు పెద్ద ఉపశమనం కలిగినట్లయింది.
ఈసారి మార్చి రెండో వారం నుంచే ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. నిన్నటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి ..
- పక్కా ప్లాన్ తోనే బాబాయ్ మర్డర్.. సీబీఐ చేతిలో కీలక వాంగ్మూలం..?
- పంజాబ్ ఫార్ములా తెలంగాణలో.. ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ
- బీజేపీ గూటికి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
- విషాదం నింపిన హొలీ పండుగ.. గోదావరి స్నానానికి వెళ్లి మృతి
One Comment