
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ మరోసారి పీక్ కు చేరింది. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్‌రెడ్డిని దింపాలని ఆ పార్టీలో కొందరు సీనియర్ నేతలు పట్టుబడుతున్నారు. మరికొందరు రేవంత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ రెండుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఆదివారం కాంగ్రెస్ సీనియర్లు సమావేశం కావడం తీవ్ర కలకలం రేపింది. అయితే హైకమాండ్ ఎంట్రీతో కాంగ్రెస్ సీనియర్ల భేటీ అర్థాంతరంగా ముగిసింది.
గతంలో మర్రి నివాసంలో సమావేశమయ్యారు కాంగ్రెస్ సీనియర్లు. తాజాగా ఆదివారం మరోసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు వీహెచ్, మర్రి శశిధర్‌రెడ్డి, జగ్గారెడ్డి, కమలాకర్‌రావు, శ్యామ్‌మోహన్ పాల్గొన్నారు. సీనియర్ సమావేశం అవుతున్నారని ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు వెళ్లింది. దీంతో హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీ కార్యదర్శి బోస్‌రాజు సీనియర్ నేతలకు ఫోన్ చేశారు. ఏమైనా సమస్య ఉంటే నేరుగా సోనియా, రాహుల్ గాంధీలకు చెప్పాలని సూచించారు. దీంతో మెజారిటీ సీనియర్లు భేటీకి చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. దీంతో సమావేశాన్ని సీనియర్లు ముగించారు. తమది అసమ్మతి సమావేశం కాదని మర్రి శశిధర్ రెడ్డి ప్రకటించారు. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లుగా తీర్మానం చేశామని చెబుతున్నారు.
మరోవైపు సీనియర్ నేతల భేటీపై పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రహస్య సమావేశం తర్వాతే.. భేటీలు మొదలయ్యాయని చెబుతున్నారు. కొందరు పార్టీలో చిచ్చు పెడుతున్నారని, పార్టీకి నష్టం చేసేవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ నాయకులతో టీఆర్ఎస్ నాయకులకు ఏం పని?, వీహెచ్‌ను హరీష్‌రావు ఏందుకు కలిశారని నిలదీస్తున్నారు. కోకాపేటలో ఏం జరిగిందో తాము బయటపెట్టాలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో సమస్యలుంటే కొట్లాడాలి కానీ.. శత్రువు దగ్గరకు వెళితే ఎలా అని నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌కు జనాల్లో క్రేజీ పెరగడంతో టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండడంతో టీఆర్ఎస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి ..
- కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ఐటీ రైడ్స్ లో అడ్డంగా బుక్కయ్యారా?
- రష్యాపై యుద్ధానికి సిద్ధమవుతున్న 98 ఏళ్ల బామ్మ
- యూట్యూబర్ మరణానికి కొబ్బరిబొండాలే కారణమా?
- ఎమ్మెల్యే కొడుకు కారులోనే ఉన్నాడు.. జూబ్లీహిల్స్ కేసులో ట్విస్ట్..
- పక్కా ప్లాన్ తోనే బాబాయ్ మర్డర్.. సీబీఐ చేతిలో కీలక వాంగ్మూలం..?
2 Comments