
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం కొనసాగిస్తోంది. దాంతో తమ మాతృదేశాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్‌లో సామాన్యుల సైతం ఆయుధాలు పట్టి పోరాటానికి దిగుతున్నారు. వారూ వీరు అని కాకుండా పెద్ద వయసు వారూ, సెలబ్రిటీలు సైతం తుపాకులతో పోరు భూమికి వెళుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన ఓల్హా తెర్దో్క్లిబోవా అనే 98 ఏళ్ల వృద్ధురాలు సైన్యం చేరి రష్యాతో పోరాడేందుకు సిద్ధమైంది.
ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ శాఖ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఓల్హా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో పని చేసింది. ఆ అనుభవంతో మళ్లీ తుపాకీ పడతానంటూ ముందుకొచ్చింది. ఓల్హా ధైర్యం ఉక్రెయిన్ అధికారులను సైతం అబ్బురపరుస్తోంది. అయితే, వయసురీత్యా ఆమెను సైన్యంలో వారు నిరాకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- యూట్యూబర్ మరణానికి కొబ్బరిబొండాలే కారణమా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం
- పక్కా ప్లాన్ తోనే బాబాయ్ మర్డర్.. సీబీఐ చేతిలో కీలక వాంగ్మూలం..?
- పంజాబ్ ఫార్ములా తెలంగాణలో.. ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ
- బీజేపీ గూటికి కోమటిరెడ్డి బ్రదర్స్ ?