
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : గచ్చిబౌలి రోడ్ యాక్సిడెంట్ లో ప్రముఖ యూట్యూబర్ గాయత్రి చనిపోయింది. హోలీవేడుకల్లో పాల్గొని వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అక్కడకక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో అభంశుభం తెలియని ఓ మహిళ చనిపోగా.. కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మద్యంమత్తుతో పాటు అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానాలు వస్తున్నాయి.
వాయిస్.. అతివేగం, నిర్లక్ష్యం ఎంతో కెరీర్ ఉన్న ఓ యూట్యూబర్ తో పాటు మరో ప్రాణం తీసింది. హోలీ సందర్భంగా వేడుకలు చేసుకున్న యూట్యూబర్ గాయత్రి.. తన స్నేహితుడితో కలిసి ప్రిజమ్ పబ్ కు వెళ్లింది. అక్కడ పార్టీ చేసుకున్న గాయత్రి తిరిగిచ్చే క్రమంలో విప్రోజంక్షన్ నుంచి గచ్చిబౌలివైపు వస్తుండగా కారు అదుపుతప్పింది. రోడ్డుపక్కన ఓ మహిళపైకి దూసుకుపోయి డివైడర్ పై పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మళ్లీశ్వరి అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. కారులో ఉన్న గాయత్రితో పాటు ఆమె స్నేహితుడు రోహిత్ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ వెంటనే ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గతరాత్రే గాయత్రి చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ రోహిత్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.
Read More : తాగిన మత్తులో కారు బీభత్సం.. ముగ్గురు మృతి.?
యూట్యూబ్ లో డాలిపేరుతో ఫేమస్ అయిన గాయత్రి పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. కొంతకాలంగా రోహిత్ తో ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు సమాచారం. హోలీ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లిన రోహిత్.. ఆమెను పికప్ చేసుకొని ప్రిజం పబ్ కు తీసుకెళ్లాడు. అక్కడ పార్టీ చేసుకొని తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద సమయంలో గాయత్రి కార్ డ్రైవ్ చేస్తున్నట్లు.. అతివేగమే యాక్సిడెంట్ కు కారణమని తెలుస్తోంది. పబ్ లో మద్యం తీసుకున్నట్లు కూడా అనుమానాలు వస్తున్నాయి. హోలీ రోజు మద్యం అమ్మడం నిషేధం. ఈ నేపథ్యంలో వారికి పబ్ లో మద్యం ఎలా దొరికిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు గాయత్రి మృతిపట్ల పలువురు టాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు. ఇది చాలా అన్యాయం.. నమ్మడానికి చాలా కష్టంగా ఉందంటూ క్యారక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి ఇన్‌స్టాలో స్టోరీ షేర్ చేశారు. అటు బిగ్‌బాస్ ఫేం షణ్నూ సైతం గాయత్రితో దిగిన ఫోటోను షేర్ చేశాడు. హార్ట్ బ్రేక్ సింబల్ జతచేశాడు.
ఇవి కూడా చదవండి ..
- హైదరాబాద్ లో కుండపోత వర్షం
- పక్కా ప్లాన్ తోనే బాబాయ్ మర్డర్.. సీబీఐ చేతిలో కీలక వాంగ్మూలం..?
- పంజాబ్ ఫార్ములా తెలంగాణలో.. ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ
- బీజేపీ గూటికి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
- విషాదం నింపిన హొలీ పండుగ.. గోదావరి స్నానానికి వెళ్లి మృతి
One Comment