
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ కారు యాక్సిడెంట్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బాలుడి మృతికి కారణమైన కారులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ పుత్ర రత్నం రాహిల్ కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. రాహిల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిలిం నగర్ నుంచి ఇన్ ఆర్బిట్ మాల్ మీదుగా తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఉన్నాడని పోలీసులు అధికారికంగా చెప్పారు. రాహిల్‌తో పాటుగా అఫ్నాన్, నాజ్ ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే కారును ఘటన స్థలిలోనే వదిలి పారిపోయారు. నిందితులు పారిపోయిన ఏరియాల్లో సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా నిందితులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని రకాల ఎవిడెన్స్‌ను సేకరించారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది అఫ్నాన్‌గా గుర్తించారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కారు డ్రైవింగ్ చేసింది అఫ్నాన్‌గా నిర్ధారించారు పోలీసులు. కారు ప్రమాదానికి నిర్లక్ష్యపు డ్రైవిండ్, ర్యాష్ డ్రైవింగ్‌యే కారణమని పోలీసులు వెల్లడించారు.
Read More : పంజాబ్ ఫార్ములా తెలంగాణలో.. ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ
గురువారం రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు మహేంద్ర థార్ జీవు అతివేగంగా దూసుకొచ్చింది. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న సుష్మా బోస్లే, కాజల్ చౌహాన్, సారికా చౌహాన్‌లను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజల్ చౌహాన్ రెండు నెలల బిడ్డ కిందపడి మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన మహేంద్ర థార్ జీపుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అహ్మద్ పేరుతో స్టిక్కర్ ఉండడంతో కేసు మరింత ఉత్కంఠగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు ప్రమాదం జరిగిన తర్వాత హైదరాబాద్‌లో నాటకీయ పరిణామాలు జరిగాయి. కారు డ్రైవిండ్ చేసింది ఎమ్మెల్యే షకీల్ కొడుకేనంటూ విస్తృతంగా ప్రచారం మొదలైంది. అధికార మదంతో అతివేగంగా డ్రైవింగ్ చేసి అభం శుభం తెలియని రెండు నెలల పసికందు మృతి చెందడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కారు ప్రమాదంలో తనకు ఎటువంటి సంబంధం లేదని..ప్రమాదానికి కారణమైన కారు తన బంధువులదని..ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తన బంధువులు మాత్రమే ఉన్నారని వివరణ ఇవ్వగా..కారులో ఎమ్మల్యే షకీల్ ఉన్నాడని తాజాగా పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి ..
- కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? ఐటీ రైడ్స్ లో అడ్డంగా బుక్కయ్యారా?
- రష్యాపై యుద్ధానికి సిద్ధమవుతున్న 98 ఏళ్ల బామ్మ
- యూట్యూబర్ మరణానికి కొబ్బరిబొండాలే కారణమా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం
- పక్కా ప్లాన్ తోనే బాబాయ్ మర్డర్.. సీబీఐ చేతిలో కీలక వాంగ్మూలం..?
- బీజేపీ గూటికి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
5 Comments