
క్రైమ్ మిర్రర్, గండిపేట్ : వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలకుండా ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకుంటే వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది పూర్వీకుల నుంచి వస్తున్న విశ్వాసమని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్ అన్నారు.
హోలీ ఉత్సవాలను పురస్కరించుకొని వారు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగంత శోభాయామనంగా ఈ పండుగను జరుపుకుంటారన్నారు. దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటని అన్నారు. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయన్నారు.
హోలీ సంబరాల్లో పాల్గొన్న గణేష్‌సింగ్
సహజ సిద్ధమైన కలర్స్ వాడి హోళీ ని జరుపుకోవాలని టీఆర్ఎస్ నాయకుడు గణేష్‌సింగ్ ప్రజలను కోరారు. వట్టినాగులపల్లిలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆయన స్థానికులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపి నీటిని చల్లుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు దరి చేరవని అన్నారు. ఈ సందర్భంగా గణేష్ సింగ్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- దేవాలయ భూములను పరిశీలించిన… మంత్రి సబితా
- తాగిన మత్తులో కారు బీభత్సం.. ముగ్గురు మృతి.?
- ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు అదుపు తప్పి బోల్తా .. ముగ్గురు మృతి
- పేదప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం .. ఉప్పల ట్రస్ట్ ఛైర్మెన్ వెంకటేష్
- కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?
One Comment