

క్రైమ్ మిర్రర్, మంగపేట : హొలీ పండుగ ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది.ఈ విషాదకర సంఘటన మండలంలోని మల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన రావుల కార్తిక్ (22)అనే యువకుడు హొలీ సంబురాలు చేసుకున్న అనంతరం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి నీటిలో దిగగా ఆ నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. ఆ యువకుడి కోసం గాలించగా సాయంత్రం శవమయై దొరికాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- స్థానికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రేమ్‌కుమార్
- దేవాలయ భూములను పరిశీలించిన… మంత్రి సబితా
- తాగిన మత్తులో కారు బీభత్సం.. ముగ్గురు మృతి.?
- ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు అదుపు తప్పి బోల్తా .. ముగ్గురు మృతి