
మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్) : తుక్కుగూడ మున్సిపాలిటీ లోని దేవునిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవాలయం భూములను టిఎస్ఐఐసీ చైర్మన్ నరసింహ్మ రెడ్డి, హెచ్ఎండిఏ అధికారులుతో కలిసి పరిశీలించిన తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఈ సందర్భంగా దేవాలయానికి చెందిన భూమికి సంభందించి హద్దులను నిర్ణయించారు. 25 ఎకరాల భూమికి సంభందించి అధికారులు మార్కింగ్ చేయటం పట్ల స్థానిక కౌన్సిలర్ లావణ్య రాజు, స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. అనంతరం జన్నాయి గూడెం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రిని ఆలయంలో పూజారులు, ధర్మ కర్తలు స్వాగతం పలికి సన్మానించారు. నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా మంత్రి హొలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తో పాటుగా వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, పార్టీ మునిసిపల్ అధ్యక్షులు జల్లాల లక్ష్మయ్య యాదవ్, రవి నాయక్, సుమన్, శ్రీకాంత్, సీనియర్ నాయకులు నరసింహ్మ రెడ్డి, శ్రీనివాస్, పుంటి కూర శేఖర్ రెడ్డి, స్థానికులు అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- తాగిన మత్తులో కారు బీభత్సం.. ముగ్గురు మృతి.?
- సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి… ఆర్.జనార్ధన్
- ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు అదుపు తప్పి బోల్తా .. ముగ్గురు మృతి
- కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?
- జూనియర్ వల్లే ఆర్ఆర్ఆర్ కు బెనిఫిట్స్ ?
One Comment