
క్రైమ్ మిర్రర్, యాదాద్రి ప్రతినిధి : కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా విభజించి, దేశ కార్మిక వర్గానికి అన్యాయాన్ని తలపెట్టడం, ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం, వాటాల ప్రకారంగా అమ్మి వేయడంను వెంటనే నిలిపివేయాలని మోడీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
tweet " class="pin-it-button" count-layout="vertical">
దేశ కార్మిక వర్గం, మార్చి 28,29 న దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె కు పిలుపు నివ్వడం జరిగిందని, ఈ సమ్మె ను విజయవంతం చేయడం కోసం కార్మిక, ఉద్యోగ సంఘాలు, ప్రజలు కృషి చేయాలని, సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్, శ్రామిక హమాలీ& మిల్ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు మోటే శ్రీశైలం లు కోరారు.
మల్లాపురంలో మార్చి 19 న జరుగు సమ్మె సన్నాహక జిల్లా సదస్సు కరపత్రాలను జనార్ధన్, శ్రీశైలం లు హమాలీ కార్మికులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రామిక హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు పుచ్చుల నర్సింహులు, పుర్మ చంద్రయ్య, పి.సహదేవులు, బి.ఆంజనేయులు, బరిగే మదార్, డి.నర్సింహులు, జి.వెంకటేశం, మటే రాజయ్య,ఎం.రవి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు అదుపు తప్పి బోల్తా .. ముగ్గురు మృతి
- పేదప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం .. ఉప్పల ట్రస్ట్ ఛైర్మెన్ వెంకటేష్
- జూనియర్ వల్లే ఆర్ఆర్ఆర్ కు బెనిఫిట్స్ ?
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని పాప మృతి.. ముగ్గురికి సీరియస్
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
xHwdCrmiBeFpEVo