
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి ప్రతినిధి : కల్వకుర్తి నియోజకవర్గంలోని పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్, తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నల్లవారి పల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన తాగునీటి వాటర్ ప్లాంట్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడారు. తన ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలతో పాటు గూడులేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఎవ్వరి సహకారం లేకుండానే తలకొండపల్లి మండలంలో వందల ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చినట్లు అయన గుర్తుచేశారు. రానున్న రోజుల్లో కల్వకుర్తి నియోజక వర్గ వ్యాప్తంగా అనేక సేవాకార్యక్రమాలు విస్తరిస్తానని అన్నారు.
మృతిని కుటుంబనికి అనుచరుల ధ్వారా ఆర్థిక సహాయం అందచేత..
తలకొండపల్లి మండలం బాలుసుల పల్లి గ్రామానికి జార్పుల చంద్రు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న తలకొండపల్లి జేడ్పీటీసీ , ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ తన ట్రస్ట్ ద్వారా మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబానికి తన అనుచరుల ద్వారా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లక్ష్మణ్ నాయక్, దాసు నాయక్ మరియు యువ నాయకులు బాలకృష్ణ, లక్ష్మణ్, యాదగిరి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?
- జూనియర్ వల్లే ఆర్ఆర్ఆర్ కు బెనిఫిట్స్ ?
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని పాప మృతి.. ముగ్గురికి సీరియస్
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
- రష్యాకు దిమ్మతిరిగే షాక్.. యుద్ధం ఆగినట్టేనా?
One Comment