
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మందుబాబుల అత్యుత్సాహానికి అమాయకులు బలైపోతున్నారు. మద్యం మత్తులో హై ఎండ్ కార్లలో రయ్యిమంటూ దూసుకెళ్తూ అడ్డొచ్చిన వారిని గుద్దేస్తున్నారు. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కారు బీభత్సం కలకలం రేపుతోంది. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న అమాయకులను బలిగొంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పరిధిలో కేబుల్ బ్రిడ్జి వద్ద జరిగిన కారు ప్రమాదంలో నెలల బాబు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆ ఘటన మరువక ముందే గచ్చిబౌలిలో మరో కారు బీభత్సం చేసింది. మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యారు.
గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ వద్ద అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కకు దూసుకొచ్చి ఫుట్‌పాత్‌పై బోల్తా కొట్టి విధ్వంసం చేసింది. అక్కడ మొక్కలకు నీళ్లు పడుతున్న మల్లీశ్వరి(38) అనే మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
ఆ సమయంలో కారులో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్‌పల్లికి చెందిన రోహిత్(26), నిజాంపేట్‌కి చెందిన షార్ట్ ఫిల్మ్ యాక్టర్ గాయత్రి(27) గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గాయత్రి చనిపోయినట్లు సమాచారం. రోహిత్ పరిస్థితి కూడా విషమించి చనిపోయినట్లు సమాచారం. యువకుడు మద్యం మత్తులో ఉన్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి ..
- సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి… ఆర్.జనార్ధన్
- ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు అదుపు తప్పి బోల్తా .. ముగ్గురు మృతి
- పేదప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం .. ఉప్పల ట్రస్ట్ ఛైర్మెన్ వెంకటేష్
- కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?
- జూనియర్ వల్లే ఆర్ఆర్ఆర్ కు బెనిఫిట్స్ ?
2 Comments