
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : హైదారాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ 45లో గురువారం అర్రాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. అత్యంత వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఓ మహిళ చేతిలో ఉన్నరెండున్నర నెలల పాప మహిళ చేతిలో నుండి కింద పడడంతో తలకు గాయలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన మహిళలతో పాటు చిన్నారీ మృత దేహాన్ని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. గాయపడిన మహిళలు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. వారంతా నగరంలోయాచక వృత్తి చేసుకుంటున్నట్టు సమాచారం.
Read More : కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?
Read More : కోమటిరెడ్డికి బిగ్ షాక్.. రేవంత్ టచ్ లోకి మునుగోడు లీడర్లు?
మరోవైపు ప్రమాదానికి కారణమైన వారు కారును అక్కడే వదిలి పారిపోయారు. ఆ కారుకు బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పేరిట ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది. దీంతో ప్రమాదం చేసిన వారు ఆయన అనుచరులు లేదా బంధువులుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- జూనియర్ వల్లే ఆర్ఆర్ఆర్ కు బెనిఫిట్స్ ?
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
- రష్యాకు దిమ్మతిరిగే షాక్.. యుద్ధం ఆగినట్టేనా?
- తెలంగాణలో పరీక్షల రగడ.. మారుస్తారా?
3 Comments