
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆర్ఆర్ఆర్ సినిమాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది జగన్ సర్కార్. ఈ సినిమాకు అదనపు షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవలే ఆర్ఆర్అర్ డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్యలు సీఎం జగన్ ను కలిసి టికెట్ ధరలు పెంపుకు అనుమతివ్వాలని కోరారు. అదనపు షోలకు పర్మిషన్ కోరుతూ బడ్జెట్ వివరాలను కూడా ప్రభుత్వానికి అందజేశారు. అందులో రెమ్యూనరేషన్ కాకుండా రూ.336 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ ఇచ్చిన దరఖాస్తును పరిశీలించిన హోం శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల ఉన్నతాధికారులు.. ఈ సినిమాకు అదనపు షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చారు.
Read More : కోమటిరెడ్డికి బిగ్ షాక్.. రేవంత్ టచ్ లోకి మునుగోడు లీడర్లు?
ఆర్ఆర్ఆర్ సినిమాను సూపర్ హై బడ్జెట్ మూవీగా పేర్కొన్న ప్రభుత్వం.. జీవో నెం.13ప్రకారం నిర్ణయించిన అన్ని రకాల టికెట్ల ధరలపై అదనంగా రూ.75 పెంచుకోవచ్చని పేర్కొంది. ఈ పెంపు సినిమా విడుదల నుంచి పది రోజుల పాటు వర్తిస్తుందని పేర్కొంది. నిజానికి ఏపీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉండి, 20శాతం షూటింగ్ ఏపీలో జరుపుకుంటే టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఉంటుంది.
ఫిబ్రవరిలో రిలీజైన భీమ్లా నాయక్ , ఈనెలలోనే విడుదలైన రాధే శ్యామ్ సినిమాలను లైట్ తీసుకుంది జగన్ ప్రభుత్వం. ప్రభాస్ స్వయంగా సీఎం ను కలిసినా ఆయన సినిమాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కాని ఆర్ఆర్ఆర్ సినిమాకు మాత్రం అన్ని ఇచ్చేసింది. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అన్న చర్చ జరుగుతోంది. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మంత్రి దగ్గరుండి ఈ వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది.
Read More : తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
దర్శకుడు రాజమౌళి.. నిర్మాత డీవీవీ దానయ్యలు ఇటీవల సీఎంను కలిసినపుడు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారని… ఆర్ఆర్ఆర్ సినిమాకు బెనిఫిట్ కలిగేలా తారక్ రిక్వెస్ట్ చేశారని తెలుస్తోంది. రాజమౌళి, దానయ్యకు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేయడంలో ఓ మంత్రి కీలక పాత్ర పోషించారని అంటున్నారు.
నందమూరి కుటుంబంతో అత్యంత సన్నిహిత్యంగా ఉండే మంత్రే చొరవ తీసుకుని.. సీఎం జగన్ తో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మీట్ అయ్యేలా చేశారని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను వీడియో కాల్ చేయమని కోరింది కూడా ఆ మంత్రే అని ప్రచారంలో ఉంది. ప్రభుత్వం పెట్టిన కండిషన్ ప్రకారం ఏపీలో సినిమా షూటింగ్ జరగకపోయినా.. ఆ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడంలో ఆ మంత్రి కీలకంగా వ్యవహరించారనే ప్రచారం ఉంది.
ఇవి కూడా చదవండి ..
- కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని పాప మృతి.. ముగ్గురికి సీరియస్
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
- రష్యాకు దిమ్మతిరిగే షాక్.. యుద్ధం ఆగినట్టేనా?
- తెలంగాణలో పరీక్షల రగడ.. మారుస్తారా?
One Comment