
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణకు జగన్ రంగం సిద్ధం చేశారు. అదే సమయంలో తెలంగాణ కేబినెట్ లో మార్పులకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఎలక్షన్ కాబినెట్ మీద ముఖ్యమంత్రి కసరత్తు చేతున్నారని, కొద్ది రోజుల్లోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. శాసన సభ బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించరు.
నామినేటెడ్ పదవుల పందారానికి శ్రీకారం చుట్టారు. అదే క్రమంలో మత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. కడియం, కవిత సహా మరి కొన్ని పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. కాని విస్తరణ జరగలేదు. కానీ ఈసారి పక్కాగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అది కూడా మరో పక్షం రోజుల్లోగా ఉంటుంది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏప్రిల్ 2 ఉగాది రోజున మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు.
Read More : కోమటిరెడ్డికి బిగ్ షాక్.. రేవంత్ టచ్ లోకి మునుగోడు లీడర్లు?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం జరిపిన సర్వేలో అనేక మంది మంత్రులకు నెగటివ్ మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు మంత్రులకు ఉద్వాసన చెప్పాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సహా ఇతర ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి శ్రీనివాస గౌడ్, గ్రానైడ్ కేసులో ఈడీ విచరణను ఎదుర్కుంటున్న గంగుల కమలాకర్ తో పాటు మరి కొందరు మంత్రుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ రెడ్డి పేరు కూడా ఉద్వాసన జాబితాలో ఉందని అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, తో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన హోమ్ మంత్రి మహ్మూద్ ఆలీని కూడా మంత్రి వర్గం నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో ఉద్యమ వ్యతిరేకులకు పెద్ద పీట వేశారనే ఆరోపణలు వస్తుండటంతో ఫిరాయింపు మంత్రులో ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదాని అంటున్నారు.
Read More : తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
గతంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్ స్థానంలో అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు చోటు దక్కటం ఖాయమనేది పార్టీ వర్గాల అంచనా. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కల్వకుంట్ల కవిత ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఇక, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కాగా ప్రాంతీయ- సామాజిక సమీకరణాలను అమలు చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- జూనియర్ వల్లే ఆర్ఆర్ఆర్ కు బెనిఫిట్స్ ?
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని పాప మృతి.. ముగ్గురికి సీరియస్
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
- రష్యాకు దిమ్మతిరిగే షాక్.. యుద్ధం ఆగినట్టేనా?
- తెలంగాణలో పరీక్షల రగడ.. మారుస్తారా?
7 Comments