
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఇంటర్,టెన్త్ బోర్డుల తీరుపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. పరీక్షల నిర్వహణ ఎందుకు విమర్శలకు దారి తీస్తోంది..? ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏం కోరుతున్నారు..? పరీక్షల బోర్డు ఏం చెబుతోంది..తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండు టెండల్లో పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ మాత్రం ఆలోచించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
Read More : కోమటిరెడ్డికి బిగ్ షాక్.. రేవంత్ టచ్ లోకి మునుగోడు లీడర్లు?
జేఈఈ పరీక్షల రీషెడ్యూల్‌తో తెలంగాణలో ఇంటర్, టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో మే 11 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించాలని బోర్డు భావించింది. జేఈఈ మెయిన్స్ కారణంగా 23 నుంచి నిర్వహిస్తున్నట్లు అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఈ పరీక్షలు జూన్ 1 వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు. దీనిపై యూటీఎఫ్, సీపీఎస్‌ఈయూ, టీఆర్డీఎఫ్, టీపీటీఎఫ్ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.ఈసారి 11 పేపర్లకు బదులు 6 పేపర్లకే పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా జనవరిలోపు సిలబస్ పూర్తి చేసి ఫిబ్రవరి నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి.
Read More : తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో బోర్డు పునరాలోచించాలంటున్నారు.ప్రభుత్వం,టెన్త్ బోర్డు తీరుపై ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు మండిపతున్నారు. వేసవిలో పరీక్షలు నిర్వహిస్తే..తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. ఈసారి వేసవి తీవ్రత అధికంగా ఉంటే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోందని అంటున్నారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలంటున్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటున్నారు విద్యార్థి తల్లిదండ్రులు.
ఇవి కూడా చదవండి ..
- కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?
- జూనియర్ వల్లే ఆర్ఆర్ఆర్ కు బెనిఫిట్స్ ?
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని పాప మృతి.. ముగ్గురికి సీరియస్
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
- రష్యాకు దిమ్మతిరిగే షాక్.. యుద్ధం ఆగినట్టేనా?