
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : పార్టీ మారే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత , మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ తగలనుందని తెలుస్తోంది. కోమటిరెడ్డి పార్టీ మారుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని చెప్పారు కోమటిరెడ్డి. గౌరవం ఇవ్వని చోట ఉండలేనని అన్నారు. ఎవరి కింద పడితే వారి కింద పని చేయనని చెప్పారు. తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానన్నారు కోమటిరెడ్డి. తనను నమ్మినవారు తన వెంట రావొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో ఆయన త్వరలోనే పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలతో బీజేపీలో చేరేందుకు ఆయన దాదాపుగా సిద్ధమయ్యారని అంటున్నారు.
Read More : బీజేపీ పెద్దలతో కోమటిరెడ్డి చర్చలు.. జంపింగ్ ముహుర్తం ఫిక్స్!
మునుగోడు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మీడియాకు దూరంగాఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చౌటుప్పల్,నాంపల్లిలో కార్యకర్తలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తా అన్నారు. సొంత పార్టీలోనే ఆదరణ కరువైందన్నారు.తెలంగాణ ఉద్యమంలో పని చేసి ధైర్యం, పేరున్న వారిని ముందు పెడితేనే కాంగ్రెస్ లో జోష్ వస్తుందని అన్నాుర రాజగోపాల్ రెడ్డి. అడ్రస్ లేని, డిపాజిట్ రాని వారిని ముందు పెట్టి కొట్లాడమంటే ఎట్లా కొట్లాడుతారని ప్రశ్నించారు. గౌరవం ఇవ్వని చోట ఉండలేనన్నారు. ఎవరి కింద పనిచేయలేనని చెప్పారు. అవసరమైతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని తెలిపారు. పార్టీ మారడం పై కార్యకర్తలను ఒప్పించి అందరి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటాన్నారు. తనను నమ్మిన వారికి అన్యాయం జరగదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Read More : రేవంత్ రెడ్డికి సీనియర్ల షాక్! కాంగ్రెస్ లో కల్లోలమేనా…
అయితే పార్టీ మార్పుపై సమావేశం నిర్వహించిన కోమటిరెడ్డికి ఊహించని షాక్ తగిలిందని తెలుస్తోంది. చాలా మంది నేతలు ఆయనతో కలిసి పార్టీ మారేందుకు సిద్ధపడలేదని సమాచారం. కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన అనుచర వర్గాన్ని గందరగోళంలో పడేస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక మనుగోడులో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీపీలు, ఒక మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. అయితే, ఆయన తీరుతో ఒక్కొక్కరూ పార్టీని వీడారు. ఇప్పుడు ఒక్క జడ్పిటిసి, ఎంపీపీ మాత్రమే మిగిలారు. అభిమానం ఉన్నా.. ఆయన క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ తో సతమతం అవుతోంది క్యాడర్. ఉన్న నేతలు కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డితో వెళ్లడం కష్టమేనని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని ముందే ఊహించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మునుగోడుపై ఫోకస్ చేశారని తెలుస్తోంది. ముఖ్యనేతలను హైదరాబాద్ పిలుపించుకుని మాట్లాడారని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారని అంటున్నారు. దీంతో కోమటిరెడ్డి పార్టీ మారినా.. ఆయనతో కాంగ్రెస్ లీడర్లు ఎక్కువగా వెళ్లే పరిస్థితి లేదంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
- రష్యాకు దిమ్మతిరిగే షాక్.. యుద్ధం ఆగినట్టేనా?
- తెలంగాణలో పరీక్షల రగడ.. మారుస్తారా?
- తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
- జనసేన పవన్ కు టీడీపీ సీఎం ఆఫర్!
6 Comments