
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు జీవనాడిగా చెప్పారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అయిందని చెబుతున్నారు. లక్షలాది ఎకరాల బీడు భూములు ఆకుపచ్చగా మారాయని ప్రచారం చేసుకుంటున్నారు. కాని విపక్షాలు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రయోజనం లేదని… అది వైట్ ఎలిఫెంట్ గా మారిందని ఆరోపిస్తున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు విపక్షాల విమర్శలు నిజం చేసేలా ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పక్కనే ఉన్నప్పటికి సాగునీరు అందకపోవడంతో రైతులు తలలు పట్టుకునే పరిస్థితి తలెత్తింది. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పచ్చటి పంట పొలాలు బీటలు వారుతున్నాయి. గంగాధర మండలంలోని లక్ష్మీదేవిపల్లి ,కొండాయపల్లి ,చర్లపల్లి గ్రామాలతో పాటు కొడిమ్యాల మండలం , మల్యాల మండలంలోని కొన్ని గ్రామాల్లో నేల తల్లి దప్పికతో అల్లాడిపోతోంది. గతంలో గోదారి జలాలతో గొంతు తడుపుకున్న ఈ ప్రాంతంలోని పంట భూములు ఇప్పుడు నీరందక నెర్రలు వాచాయి. అధికారుల అలసత్వంతో మళ్ళీ పంటలు ఎండిపోయి కనపడుతున్నాయి. వేసవి కాలం మొదట్లోనే ఇలాంటి పరిస్థితి కనిపించడంతో రానున్న రోజుల్లో మారేలా ఉంటుందోనని రైతులు రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి పంట నష్టపోతామనే ఆందోళన ఈప్రాంత రైతుల్లో కనిపిస్తోంది.
Read More : కోమటిరెడ్డికి బిగ్ షాక్.. రేవంత్ టచ్ లోకి మునుగోడు లీడర్లు?
మెట్ట ప్రాంతంగా ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో బావులు ఎండిపోతున్నాయి. ఈ ప్రాంత రైతుల సాగు అవసరాల కోసం నారాయణపూర్ జలాశయాన్ని నిర్మించింది ప్రభుత్వం.రామగుండంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా నారాయపూర్‌కి నీళ్లు మళ్లిస్తారు. ఇలా ఈ ప్రాంతవాసులకు గోదావరి నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈసారి ఇంతవరకు నీళ్లు రాకపోవడంతో ఇప్పటికే పొలాలు నెర్రెలు వాసిన పరిస్థితి కళ్ల ముందే కనబడుతుంది. ఇప్పటికైనా నీళ్లు వస్తే పంట చేతికి వచ్చే అవకాశాము ఉందని రైతులు వాపోతున్నారు. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో బావులు ,బోర్లు ఎండిపోతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.
కరీంనగర్ జిల్లాలో సాగునీరందక రైతులు తలలు పట్టుకుంటుంటే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారని నారాయణపూర్ జలాశయానికి నీళ్లు వచ్చే పైప్ లైన్ రిపేర్ ఉండటం వల్లే నీటి సరఫరా ఆలస్యం అవుతుందని రైతులకు చెబుతున్నారు ఈ ప్రాంత నేతలు. పది రోజులుగా పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని..పూర్తి అయినట్లుగా త్వరలోనే నీళ్లు విడుదల చేస్తామని చెబుతున్నారు. నిజానికి చొప్పదండి నియోజకవర్గం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కారణంగా వాటర్ జంక్షన్ గా మారింది. .లక్ష్మీపూర్ పంప్ హౌస్ ,నారాయణపూర్ జలాశయం ,రాంపూర్ పంప్ హౌస్, SRSP కాలువలు, కొత్తగా కాళేశ్వరం మూడు టిఎంసి కాలువ ఈ విధంగా ఏటూ చూసిన నీటి సదుపాయాలు ఉన్న ఈప్రాంతం వేసవి మొదట్లోనే ఇలా ఎడారిగా మారిపోవడం బాధాకరంగా మారింది. ఎండిపోతున్న పంటలను చూసైనా, నష్టపోతామనే ఆందోళనలో ఉన్న రైతుల ముఖాలు చూసైనా అధికారులు అలసత్వం వీడి పంటలకు నీళ్లు అందించే మార్గం చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ఢీకొని పాప మృతి.. ముగ్గురికి సీరియస్
- కరీంనగర్ జిల్లాలో ఎండిపోతున్న పొలాలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తదేనా?
- రష్యాకు దిమ్మతిరిగే షాక్.. యుద్ధం ఆగినట్టేనా?
- తెలంగాణలో పరీక్షల రగడ.. మారుస్తారా?