
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నారు. మన ఊరు మన పోరు పేరుతో భారీ సభలు నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి సభలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు నేతలు మంత్రాంగం జరుపుతున్నారు. ఆయనకు చెక్ పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు.టీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో కొందరు సీనియర్ నేతలు సమావేశమయ్యారు.కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరిట నిర్వహించిన భేటీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, కోదండరెడ్డి, జగ్గారెడ్డి, కమలాకర్ రావు, జీ నిరంజన్, శ్యామ్ మోహన్ తోపాటు సుమారు 15మంది వరకు సీనియర్ నాయకులు హాజరయ్యారు.
Read More : యూపీలో బీజేపీని గెలిపించిన ఎంఐఎం.. ఇవిగో లెక్కలు..
ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ తో పాటు జాతీయ పరిణామాలు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై కూడా చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు చాలా వరకు రేవంత్ నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. నిరసన గళాలను వినిపిస్తూనే ఉన్నారు. గతంలోనూ రేవంత్ వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పీసీసీ తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించారు. కొల్లాపూర్ వేదిక నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రకటన చేయడాన్ని సీనియర్లు తప్పు పడుతున్నారని తెలుస్తోంది. పీసీసీ, రాజకీయ సలహ కమిటీలో చర్చించకుండా, రేవంత్ రెడ్డి ఏక పక్షంగా ఎలా పాదయాత్ర ప్రకటన చేస్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ముందుకెళ్తున్నట్లు భావిస్తున్న వీరంతా పీసీసీకి తగిన రీతిలో సలహాలు, సూచనలు చేయాలా? లేదంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేలా అనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డితోపాటు కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ఈ నేతలు బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం అంటూ ఢిల్లీకి వెళ్లి, రేవంత్ రెడ్డి అధ్యక్ష పదివి నుంచి తప్పించే విధంగా అధిష్టానం పై వత్తిడి తెచ్చే ఆలోచనలో సీనియర్లు ఉన్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలతో పంజాబ్ సీనే తెలంగాణలోనూ పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నాయి. ఈ పరిస్థితికి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కల్చర్ అర్థం కాకపోవడం కూడా ఒక కారణమని.. రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ అధ్యక్షుని తరహాలో వ్యవహరించడం వల్లనే సమస్యలు వస్తున్నాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
- జనసేన పవన్ కు టీడీపీ సీఎం ఆఫర్!
- జీవో 111 రద్దు సాధ్యమేనా? కోర్టులు ఒప్పుకుంటాయా?
- బీజేపీ పెద్దలతో కోమటిరెడ్డి చర్చలు.. జంపింగ్ ముహుర్తం ఫిక్స్!
- జగన్ కొత్త కేబినెట్ సిద్ధం.. ఇదిగో లిస్ట్!
One Comment