
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం కోమటిరెడ్డి బ్రదర్స్. హాట్ హాట్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉంటారు. సొంత పార్టీపైనా విమర్శలు చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా… కొంత కాలంగా ఆ పార్టీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమని భావించారు. ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కూడా కలవడంతో కమలం గూటికి చేరడం ఖాయమైందని ప్రచారం జరిగింది. కాని ఏడాదికిపైగా అది జరగలేదు. అయినా కోమటిరెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారన్న చర్చ మాత్రం ఆగడం లేదు.
తాజాగా అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కల్గించే కామెంట్లు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీంతో బీజేపీలో చేరడానికి ఇప్పుడు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో… ఆ పార్టీలో చేరడానికి ఇదే మంచి సమయమని కోమటిరెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవలే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో సమావేశం అయ్యారని సమాచారం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడానికి ఒక రోజు ముందే ఈ భేటీ జరిగిందని సమాచారం. తన పార్టీ మార్పుపై చర్చించేందుకు వివేక్ ను రాజగోపాల్ రెడ్డి కలిశారని అంటున్నారు. వివేక్ తో జరిగిన సమావేశంలో రాజగోపాల్ రెడ్డి చేరికకు సంబంధించి ముహుర్తం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు.
Read More : యూపీలో బీజేపీని గెలిపించిన ఎంఐఎం.. ఇవిగో లెక్కలు..
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఏప్రిల్ 14 నుంచి మలివిడత పాదయాత్ర చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. నాలుగు రాష్ట్రాల విజయం తర్వాత బీజేపీ హైకమాండ్ తెలంగాణపైనే ప్రధాన పోకస్ చేసిందని తెలుస్తోంది. తెలంగాణ కోసం అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారని, అందులో భాగంగానే ఆయన సంజయ్ పాదయాత్రకు వస్తున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నారు. అమిత్ షా భారీ బహిరంగసభలో పాల్గొంటారని చెబుతున్నారు. ఆ సభలోనే రాజగోపాల్ రెడ్డి కమలం తీర్థం పుట్టుకుంటారని పక్కాగా తెలుస్తోంది. ఆ లోపే తన అనుచరులతో కోమటిరెడ్డి సమావేశం అవుతారని అంటున్నారు.
ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నా… గతంలో భువనగిరి ఎంపీగా పని చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనకు పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. జనగామ, రంగారెడ్డి జిల్లాలోనూ ఆయనకు గట్టి పట్టుంది. దీంతో పెద్ద సంఖ్యలో నేతలను తీసుకుని బీజేపీలో చేరేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. పార్టీ మార్పుపై మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సమాచారం ఇచ్చారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
- జనసేన పవన్ కు టీడీపీ సీఎం ఆఫర్!
- జీవో 111 రద్దు సాధ్యమేనా? కోర్టులు ఒప్పుకుంటాయా?
- రేవంత్ రెడ్డికి సీనియర్ల షాక్! కాంగ్రెస్ లో కల్లోలమేనా…
One Comment