
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వం రైతులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. రైతు బంధు పథకం అమలులో కీలక నిర్ణయం తీసుకుంది. కొందరు రైతులకు రైతు బంధు కట్ చేయబోతోంది. వచ్చే జూన్ లో ఇవ్వాల్సిన రైతు బంధులో కొందరు రైతులకు డబ్బులు ఇవ్వకుండా కట్ చేస్తోంది.148 మంది రైతులకు రైతు బంధు ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఎక్సైజ్‌శాఖ. గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేయాలని సూచించింది. గంజాయి పండిస్తున్న 148 మంది రైతులపై 121 కేసులు నమోదు చేసింది.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ జిల్లాల్లో తనిఖీలు చేసిన ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నారాయణ్‌ఖేడ్, మహబూబాబాద్, జహీరాబాద్, వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌కి చెందిన రైతులపై కేసులు నమోదు చేసింది. కేసులు నమోదైన వాళ్లకు జూన్‌లో వస్తున్న రైతుబంధును ఇవ్వొద్దని లేఖలో పేర్కొంది ఎక్సైజ్‌శాఖ. నల్గొండ, సూర్యాపేటలో సైతం గంజాయి పండిస్తున్న రైతుల వివరాలు సేకరించింది. గంజాయి సాగు చేసిన 148 మంది రైతుల ఆధార్‌కార్డులు, ల్యాండ్ డాక్యుమెంట్లను కలెక్టర్లకు పంపింది ఎక్సైజ్‌శాఖ, శీలావతి అనే గంజాయి మొక్కలను రైతులకు పండిస్తున్నట్టు గుర్తించింది.
ఇవి కూడా చదవండి ..
- జనసేన పవన్ కు టీడీపీ సీఎం ఆఫర్!
- జీవో 111 రద్దు సాధ్యమేనా? కోర్టులు ఒప్పుకుంటాయా?
- రేవంత్ రెడ్డికి సీనియర్ల షాక్! కాంగ్రెస్ లో కల్లోలమేనా…
- బీజేపీ పెద్దలతో కోమటిరెడ్డి చర్చలు.. జంపింగ్ ముహుర్తం ఫిక్స్!
5 Comments