
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణకు రంగం సిద్ధమవుతోంది. రెండున్నర ఏళ్లకు మంత్రులను మార్చేస్తానని ప్రమాణస్వీకార సమయంలోనే చెప్పారు సీఎం జగన్. కాని రెండున్నర ఏళ్ల పాలన పూర్తైనా ఇంకా కేబినెట్ లో మార్పులు జరగలేదు. గత డిసెంబర్ లోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణ ఉంటుందనే ప్రచారం జరిగింది. కాని వాయిదా పడింది. తాజాగా మాత్రం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఉగాదికి లేదంటే జూలైలో పార్టీ ప్లీనరీ తర్వాత.. కేబినెట్ విస్తరణ జరగడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే మార్పులపై జగన్ క్లారిటీకి వచ్చారని, కొత్త మంత్రుల జాబితా దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. రెడ్లకు ప్రాధాన్యం కొనసాగిస్తూనే.. ఈసారి బీసీలకు మరింత ప్రాధాన్యం దక్కబోతోందని తెలుస్తోంది. జిల్లాల వారీగా వీరికే ఛాన్స్ అంటూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మంత్రి మండలి రేసులో ఉన్న ఆ ఆశావహుల జాబితా ఇలా ఉంది…..
చిత్తూరు జిల్లా : ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి
కడప జిల్లా: సి.రామచంద్రయ్య, శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు
కర్నూలు జిల్లా: శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్ ఖాన్
అనంతపురం జిల్లా: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఉష శ్రీ చరణ్
నెల్లూరు జిల్లా : మేకపాటి కుటుంబ సభ్యుల్లో ఒకరు, ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి
ప్రకాశం జిల్లా: సుధాకర్ బాబు, అన్నా రాంబాబు
గుంటూరు జిల్లా: ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి
కృష్ణాజిల్లా: కె. పార్థసారథి, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, జోగి రమేష్
పశ్చిమగోదావరి జిల్లా: ఎం. ప్రసాదరాజు, బాలరాజు, గ్రంధి శ్రీనివాస్
తూర్పుగోదావరి జిల్లా: దాడిశెట్టి రాజా, పొన్నాడ సతీష్
విశాఖ జిల్లా: గుడివాడ అమర్నాథ్, బి. ముత్యాల నాయుడు
విజయనగరం: కోలగట్ల వీరభద్ర స్వామి, రాజన్న దోర
శ్రీకాకుళం జిల్లా: తమ్మినేని సీతారాం
ఇవి కూడా చదవండి..
- తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్.. రైతు బంధు కట్?
- పవన్ కు టీడీపీ సీఎం ఆఫర్!
- జీవో 111 రద్దు సాధ్యమేనా? కోర్టులు ఒప్పుకుంటాయా?
- రేవంత్ రెడ్డికి సీనియర్ల షాక్! కాంగ్రెస్ లో కల్లోలమేనా…
- బీజేపీ పెద్దలతో కోమటిరెడ్డి చర్చలు.. జంపింగ్ ముహుర్తం ఫిక్స్!