
- క్రైమ్ మిర్రర్ వరుస కధనాలకు కదిలిన అధికార యంత్రాంగం
- అవినీతి గుట్టు రట్టు చేసే దిశగా అడుగులు.
- చైర్మెన్, సిఈఓలపై డైరెక్టర్ల ధ్వజం
- ఫోర్జరి చేసి వేల రూపాయలు స్వాహా
- గోనె సంచుల జాడ కనుమరుగు, దొంగిలించారని ప్లేట్ పిరాయింపు
- రైతులను మోసం చేస్తూ, కోతల పేరుతో ఖాతాలో జమ
- అన్ని నేనే అంటున్న సిఈఓ, అంతు చిక్కని అసలు మర్మం
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): క్రైమ్ మిర్రర్ వరుస కధనాలకు జిల్లా అధికార యంత్రాంగం కధం తొక్కింది. గుట్టు రట్టు చేసే దిశగా విచారణ కై పావులు కదుపుతుంది. జిల్లాలోని మర్రిగూడ మండలంలోని సహకార పరపతి సంఘం నందు జరుగుతున్న అవినీతి అక్రమాలపై వరుస కధనాల వల్ల సోమవారం రోజు జిల్లా అధికారులు మర్రిగూడ సహకార సంఘం నందు డైరెక్టర్ల సమక్షంలో విచారణ నిర్వహించారు.
ఫోర్జరి చేసి అరవై వేల బిల్లుగల తీర్మాణాని ఒక లక్ష రూపాయలుగా మార్చి అక్రమంగా డబ్బులు డ్రా చేసారని ఇందులో సిఈఓ కి కూడా పర్సెంటేజ్ ఉన్నట్లు, ఇప్పటికే వేల సంఖ్యలో గోనె బస్తాల జాడ లేదని ఇవ్వన్ని ఎక్కడ పోయాయని ఉన్నత అధికారి ముందు సిఈఓ ను డైరెక్టర్లు నిలదీశారు. ఆరు కాలం కష్ట పడి రైతులు పండించిన దాన్యంలో కోతలు విధించి మోసం చేసారని వాటికి కారణాలు చెప్పాలని అడిగారు. హమాలి కూలీ అని చెప్తూ ఒక్కో రైతు నుండి క్వింటాకు యాబై రూపాయల నుండి అరవై రూపాయలు వసూలు చేసారని, అసలు రైతుల నుండి డబ్బులు వసూలు చేసి హమాలీలకు ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారని, నేరుగా రైతే డబ్బులు ఇవ్వకుండా మధ్య వర్తులు మీరు దేనికని అన్నారు. రైతులకు ఇచ్చిన లోన్ ల నుండి కూడా ఇరవై వేల రూపాయలు తీసుకున్నారని వాటి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వీటన్నింటికి సమాధానం చెప్పాలని అడుగగా ఈ తప్పులు నేనే చేసానని తిరిగి రికవరీ కడతానని సిఈఓ చెప్పిన సమాధానం అందరిని అర్చర్యానికి గురిచేసింది. మొన్నటి వరకు ఏ తప్పు చేయలేదని వాధించిన ఒక అధికారి, నేనే తప్పు చేసాను తిరిగి రికవరీ చేస్తాను అని చెప్పటం పై అసలు మర్మం ఏంటని, అధికార పార్టీ అండదండలతో అన్నీ నేను చూసుకుంటాను నీ మీద నేరం వేసుకో అని చైర్మెన్ చెప్పి ఉంటాడని అనుకుంటున్నారు. వచ్చిన అధికారులు సైతం సిఈఓ ఒక్కడినే బాద్యున్ని చేసి చేతులు దులుపుకునే విధంగా అనిపిస్తుందని, ఫోర్జరి చేసి డబ్బులు తీసుకున్న వారిని వదిలేసి ఒక్క సిఈఓ నే బాధ్యులని చేయటం సరికాదని, దీనిలో చైర్మెన్ పాత్ర కూడా ఉందని డైరెక్టర్ లు వచ్చిన అధికారితో అన్నారు.
సొసైటి ఖర్చులతో సంబంధం లేకుండా టెంట్లు వేసి రైతులను పిలిపిస్తామని, ఈ అవినీతి విషయం పై రైతులతో బహిరంగ చర్చ పెట్టండి, నిజాలు తెలుస్తాయని అధికారికి కోరారు. విచారణ మొదలైన సమయం నుండి ఉన్నత అధికారి, డైరెక్టర్లతో మాట్లాడుతున్నారే తప్ప సంబంధించిన రికార్డులను మా ముందు పరిశీలన చేయలేదని, విచారణ తుది సారాంశాని మాకు చెప్పలేదని ఇందులో కూడా ఏదో మతలబు జరుగుతుందని అనుమానాలు వ్యక్తం చేసారు. ఈ విచారణలో అభియోగం మోపబడుతున్న చైర్మెన్ ని రాకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారని, అధికార పార్టీ నాయకులకు ఉన్నత అధికారులు సైతం వంత పాడుతున్నారని ఆరోపించారు. గత కొద్ది రోజుల క్రితం వైస్ చైర్మెన్ ని ఎంపిక చేయాలని తీర్మానం చేసినప్పటికి ఇంతవరకు దానిపై స్పందనే లేదని, సంవత్సరం దాటుతున్నా సంఘానికి వైస్ చైర్మెన్ కోసం ఎందుకు ప్రపోసల్ పెట్టడం లేదని అధికారిని నిలదీశారు.
వైస్ చైర్మెన్ ఎంపికకై చైర్మెన్, డైరెక్టర్లను ఏడున్నర లక్షలు డిమాండ్ చేసారని, నాకు ఎలక్షన్ లో పదిహేను లక్షలలు ఖర్చు అయ్యాయని అందులో సగం నాకు ఇచ్చిన వారికే పదవి ఇవ్వటానికి నేను అంగీకరిస్తానని చైర్మెన్ మాతో గొడవ పెట్టుకున్నారని డైరెక్టర్లు ఆరోపించారు. తప్పు చేసిన వారు తప్పించుకోకుండా అధికారులు విచారణ చేస్తారా కొస మెరుపులా మెరిసి పోతార అనేది చూడాల్సి ఉంది.
విచారణ అధికారి వివరణ: చట్ట ప్రకారం తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని, పూర్తి నివేదిక రికార్డు పరిశీలన ఆధారంగానే జిల్లా ఉన్నత అధికారులకు ఇస్తామని, తదుపరి చర్యలు వారి నిర్ణయం ప్రకారం ఉంటాయని, దీనిపై ఎటువంటి అపోహ పెట్టుకోవద్దని తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- మాడి మసైపోతావ్.. కేటీఆర్ కు సంజయ్ వార్నింగ్
- కెనడాలో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
- కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర..
- ఇసుక క్వారీలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
One Comment