
పాలేరు, క్రైమ్ మిర్రర్: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తాసిల్దార్ కార్యాలయంలో పని చేసే వీఆర్ఏ దుర్గంబాబును కొందరు దుండగులు హత్య చేయడాన్ని నిరసిస్తూ సోమవారం తిరుమలాయపాలెం తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ డి పుల్లయ్యకు వినతి పత్రం అందజేశారు.
వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ కె జి మాట్లాడుతూ… హత్యకు గురైన బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని బాబు కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి వంగూరి రామకృష్ణ గుర్రాల సుదర్శ మెంటమ్ శ్రీనివాస్ అనిల్ ఆనంద్ ప్రవీణ్ రవి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా కృషి చేయాలి – గంగిడి మనోహర్ రెడ్డి
- సహకార లీలలు.. ఫోర్జరి చేసి లక్షల రూపాయలు స్వాహా
- మాడి మసైపోతావ్.. కేటీఆర్ కు సంజయ్ వార్నింగ్
- కెనడాలో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
- కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
2 Comments