
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి కార్యకర్తలు, అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిల సమన్వయంతో పని చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
తెలంగాణ లో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దూడల బిక్షం గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు రమనగోని శంకర్, మండల అధ్యక్షులు రెక్కల సుధాకర్ రెడ్డి, నాయకులు పాల కుర్ల జంగయ్య గౌడ్, పెద్ద కొండూరు సర్పంచ్ రమేష్ గౌడ్, పంతంగి సర్పంచ్ బాత రాజు సత్యం, నాయకులు తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్ బాబు, బండమీది మల్లేశం, ఆలే నాగరాజు, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కడవేరు పాండు, పార్టీ సీనియర్ నాయకులు రాధారపు సత్తయ్య, ఏనుగు సుధాకర్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఎలుక రాజు కోటయ్య, మల్లేశం, మిర్యాల రవి, ఉప్పు అంజనేయులు, లింగస్వామి, కనకాచారి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- సహకార లీలలు.. ఫోర్జరి చేసి లక్షల రూపాయలు స్వాహా
- మాడి మసైపోతావ్.. కేటీఆర్ కు సంజయ్ వార్నింగ్
- కెనడాలో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
- కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర..
- ఇసుక క్వారీలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
2 Comments