
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైఆయన బావ బ్రదర్ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగడంలేదని అనిల్ అన్నారు. దీనిపై సీఎం జగన్‌కు లేఖ రాస్తానన్నారు. ఎన్నికల ముందు పార్టీ కోసం కృషి చేసిన సంఘాలు..ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. పార్టీ పెట్టాలంటూ అన్నిసంఘాలవారు తనను కోరుతున్నారన చెప్పిన అనిల్., పార్టీ పెట్టడం చాలా పెద్ద విషయమన్నారు. దీనిపై సుదీర్ఘంగా అలోచిస్తానన్నారు. బీసీని సీఎం చేయాలని డిమాండ్ వస్తోందని, అభిమానుల కోరికను కచ్చితంగా నెరవేరుస్తాన్నారు. సీఎం జగన్‌ను చూసి రెండున్నరేళ్లు అయిందని, ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ తనకు అవసరం లేదని బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు.
ఇటీవలే విజయవాడలో కూడా వివిధ సంఘాలతో బ్రదర్ అనిల్ సమావేశం అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ఏపీలో కొత్త పార్టీ పెట్టాలని ఈ సందర్భంగా అనిల్‌ను కొంతమంది నేతలు కోరినట్లు ప్రచారం జరిగింది. ఏపీలో కొత్త పార్టీ రావాలి అని బీసీ నేతలు అనిల్‌తో ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై అనిల్ స్పందించారు. ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచన లేదని.. పార్టీ అంశం మొత్తం ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు. ఏమైనా ఉంటే.. తానే మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడిస్తానన్నారు.
గత నెలలో బ్రదర్ అనిల్ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ని కలిశారు. ఇద్దరు కాసేపు రాజకీయాల గురించి చర్చించారు.. రాజకీయాలు అంటే మంచి చేయటమని.. రాజకీయ జ్ఞానం తెలుసుకునేందుకు ఉండవల్లిని కలిసినట్లు బ్రదర్ అనిల్ తెలిపారు. మా సీక్రెట్‌లు మాకు ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. బ్రదర్ అనిల్‌తో కుటుంబంతో అనుబంధం ఉందని.. అందుకే తనను మళ్లీ కలిసినట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. రాజకీయ, కుటుంబ పరిస్థితులపై చర్చించామని.. భీమవరం వెళుతూ తనను కలిశారని.. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టం పుస్తకాన్ని అనిల్‌కు అందజేసినట్లు తెలిపారు. ఏపీలో బ్రదర్ అనిల్ కుమార్ వరుస సమావేశాలు చర్చనీయాంశమయ్యాయి.. ఆయన మాత్రం ప్రస్తుత్తం పార్టీ పెట్టే ఆలోచన లేదని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి ..
- మహిళలను వేధిస్తున్న తెలంగాణ బీజేపీ నేత!
- కల్వకుర్తిలో దూసుకువస్తున్న యువకేరటం.. ఉప్పల చూపు అసెంబ్లీ వైపు ..?
- ఏపీలో విపక్షాలు ఏకమవుతాయా? పవన్ వెనుక బీజేపీ పెద్దలున్నారా?
- ఆస్థి తగాదా… పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య ప్రయత్నం.
- వీఆర్ఏ హత్యకు నిరసనగా విధులు బహిష్కరించిన వీఆర్ఏలు…
One Comment