
- కల్వకుర్తి నియోజకవర్గం లో ఆయన రూటే వేరు..
- స్వాతంత్ర అభ్యర్థి గా ఎమ్మెల్యే కు పోటీ చేయాలనీ అనుచరవర్గాలాల్లో బహిరంగ చర్చలు ..?
క్రైమ్ మిర్రర్ కల్వకుర్తి నియోజకవర్గం నిఘా ప్రతినిధి : వీడు ఆరడుగుల బుల్లెట్టూ.. ధైర్యం నింపిన రాకెట్టూ’ అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ ని వర్ణించిన పాట అభిమానుల్నే కాదు అందరినీ అలరించింది. కల్వకుర్తి నియోజకవర్గం రాజకీయాల్లో కూడా అలాంటి ఓ బుల్లెట్టే ఉంది. ఆ బుల్లెట్ మరెవరో కాదు యువనేత తలకొండపల్లి జేడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ స్వతంత్ర అభ్యర్దిగా జేడ్పీటీసీ గా ఎన్నికయ్యారు.
గత మూడు సంవత్సరాల నుండి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయన ట్రస్టు ద్వారా చేయూతనిస్తూ.. ఆరు మండలలో పేద, బీద, మధ్యతరగతి కుటుంబంలో ఎవరు మరణించిన మూడు వేల ఆర్థిక సహాయం అందచేస్తు, అదేవిధంగా తలకొండ పల్లి మండలంలోని పూరి గుడిసె లేనే మండలంగా తీర్చి దిద్దుతా అని ఇళ్ళు లేని నిరుపేదలకు పక్కా ఇళ్ళు కట్టించే కార్యక్రమం మొదలు పెట్టి నిరుపేదలకు అండగా నిరంతరం ప్రజలకు తోడుగా నిలిచే మనసున్న నాయకుడిగా నిలిచారు..
కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల ట్రస్ట్ నుండి నిరుపేద విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువుల కోసం లక్షల రూపాయలు అందచేస్తు నియోజకవర్గ ప్రజలల్లో అయన కంటూ ఒక గుర్తింపు సాధించు కున్నాడు. ఇప్పుడు తాజాగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల వెంకటేష్ అంటే ఆరు మండలలోని ప్రజలు గుర్తు పట్టేలా ఉప్పల ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తూ నియోజకవర్గ ప్రజలల్లో అతను ఒక సైనికుడిలా ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి స్వాతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తే ఎమ్మెల్యే గా గెలుపొందడం ఖాయం అని అయన అనుచర వర్గం చపాకింద నీరులా రూపకల్పన నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఆస్థి తగాదా… పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య ప్రయత్నం.
- వీఆర్ఏ హత్యకు నిరసనగా విధులు బహిష్కరించిన వీఆర్ఏలు…
- రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా కృషి చేయాలి – గంగిడి మనోహర్ రెడ్డి
- సహకార లీలలు.. ఫోర్జరి చేసి లక్షల రూపాయలు స్వాహా
- మాడి మసైపోతావ్.. కేటీఆర్ కు సంజయ్ వార్నింగ్