
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో 2014 సీన్ రిపిట్ కాబోతోందా? 2024 ఎన్నికల్లో హోరాహోరీ పోరు జరగనుందా? అంటే తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో అవుననే తెలుస్తోంది. ఏపీలో పొత్తులపై కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ- జనసేన మధ్య పొత్తు ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా పవన్ కల్యాణ్ మాత్రం వైసీపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యే సంకేతాలు ఇవ్వడం సంచలనంగా మారింది.
ఇప్పటం సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్ పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు జనసేన అధినేత. ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అన్నారు. ప్రజా పాలన కోసమే నిర్ణయం తీసుకుంటామన, ఇందుకోసం పొత్తుల విషయంలో పట్టువిడుపులు వదులుకుంటామని కూడా చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనడం ద్వారా… పరోక్షంగా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పని చేస్తాయన్న సంకేతాలిచ్చారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ విధానాలను దుమ్మెత్తిన పోసిన జనసేనాని.. వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఎవరూ సంతోషంగా లేరన్నారు. జగన్ పాలనే కూల్చివేతలతో మొదలైందన్నారు.
పొత్తులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ హాట్ గా మారాయి. పవన్ ప్రకటనపై టీడీపీ నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు. అన్ని విధాలా పెయిలైన జగన్ సర్కార్ ను ఓడించడమే తమ లక్ష్యమంటున్నారు టీడీపీ నేతలు. పొత్తులపై చంద్రబాబు నిర్ణ.యం తీసుకుంటారని చెబుతూ.. పరోక్షంగా పవన్ ప్రతిపాదనకు సై అంటున్నారు. అయితే జనసేన చీఫ్ ప్రకటనపై బీజేపీ మాత్రం ఇంకా అధికారికంగా స్పందించలేదు. జనసేనతో పొత్తుకు ఓకే గాని.. టీడీపీతో మాత్రం కలిసే ప్రసక్తే లేదని కొన్ని రోజులుగా కమలం నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తాజా ప్రకటనపై బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు బీజేపీ హైకమాండ్ డైరెక్షన్ లోనే పవన్ ఈ ప్రకటన చేశారనే చర్చ కూడా జరుగుతోంది.
తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని పవన్ స్పష్టం చేశారు. అప్పుల్లేని రాష్ట్రంగా ఏపీని చేయాలన్నదే జనసేన లక్ష్యమని అన్నారు. అందుకోసమే జనసేన షణ్ముఖ వ్యూహం అనుసరించనున్నట్లు వెల్లడించారు. అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానం తీసుకొస్తామన్నారు.విశాఖ, విజయవాడను హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దడంతో పాటు అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తామని అన్నారు. ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి ..
- మహిళలను వేధిస్తున్న తెలంగాణ బీజేపీ నేత!
- కల్వకుర్తిలో దూసుకువస్తున్న యువకేరటం.. ఉప్పల చూపు అసెంబ్లీ వైపు ..?
- బ్రదర్ అనిల్ టార్గెట్ ఏంటీ? బీజేపీ డైరెక్షన్ లో ఉన్నారా?
- ఆస్థి తగాదా… పిల్లలతో కలసి తల్లి ఆత్మహత్య ప్రయత్నం.
- వీఆర్ఏ హత్యకు నిరసనగా విధులు బహిష్కరించిన వీఆర్ఏలు…