
పాలేరు, క్రైమ్ మిర్రర్ : ఆస్థి పంపకాల విషయంలో న్యాయం చేయాలని ఇద్దరు పిల్లలతో వాటర్ ట్యాంక్ ఎక్కి తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన సోమవారం మండల కేంద్రంలో వెలుగు చూసింది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన ఆళ్ల రవి, కూసుమంచికి చెందిన సుజాతకు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. వారి 15ఏండ్ల దాంపత్య జీవితానికి ఉజ్వల, వెంకటవినీష్ అనే పిల్లలున్నారు.
ఇరువురి మధ్య తలెత్తిన మనస్పర్థల వల్ల గత కోన్నెళ్లుగా రవి, సుజాత తన ఇద్దరు పిల్లలతో విడిగా వుంటున్నారు. ఆస్థి విషయమై గత కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతుండడం, పెద్ద మనుషుల వద్ద ఆస్థి సమస్య పరిష్కారం కాక, తిరుమలాయపాలెం పోలీసు స్టేషన్ మరియు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లు ఆశ్రయించారు. అక్కడ కూడా తమకు న్యాయం జరగలేదని బాధితురాలు తెలిపింది.
వారసత్వంగా తన ఇద్దరు పిల్లలకు చెందాల్సిన ఆస్థిని వారికి చెందకుండా చేస్తున్నారని మనోవేదనకు గురైన సుజాత పిల్లలు ఇద్దరితో కలిసి తిరుమలాయపాలెం చేరుకున్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ప్రక్కన నూతన వాటర్ ట్యాంకు పైకెక్కి, సుజాత పిల్లలతో వాటర్ ట్యాంకు పైనే గంటకు పైగా ఆందోళన చెప్పటింది. విషయం తెలుసుకున్న
ఎమ్మార్వో పుల్లయ్య, ఎంపిడిఓ జయరాం, ఎస్సై గిరిధర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొన్నారు.చరవాణి ద్వారా సుజాతతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీవ్వడంతో పిల్లలతో కలసి కిందకు దిగివచ్చారు. దీంతో అధికారులు సుజాతకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
80ఏండ్ల పండు ముసలి వయసు నుంచి 10 ఏండ్ల పసి ప్రాయం వరకు వాటర్ ట్యాంకులు ఎక్కడం పరిపాటిగా మారింది. మండల కేంద్రంలోని గలా వాటర్ ట్యాంకుల పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటాము అనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని స్థానిక ప్రజలు అంటున్నారు.
వాటర్ ట్యాంకులు ఎక్కకుండా 20 అడుగుల ఎత్తు వరకు మెట్లు తొలగించి, వాటర్ ట్యాంకులు క్లీన్ చేసుకొనే సమయంలో ప్రత్యామ్నాయంగా నిచ్చెన వాడగలిగితే ట్యాంకులు ఎక్కేవారి సంఖ్యను అరికట్టవచ్చని అధికారులు ఆ దిశగా ఆలోచించాలని స్థానిక గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వాటర్ ట్యాంకులు ఎక్కే బాధితుల పట్ల అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.
ఇవి కూడా చదవండి ..
- వీఆర్ఏ హత్యకు నిరసనగా విధులు బహిష్కరించిన వీఆర్ఏలు…
- రాబోయే ఎన్నికల్లో గెలుపు దిశగా కృషి చేయాలి – గంగిడి మనోహర్ రెడ్డి
- సహకార లీలలు.. ఫోర్జరి చేసి లక్షల రూపాయలు స్వాహా
- మాడి మసైపోతావ్.. కేటీఆర్ కు సంజయ్ వార్నింగ్
- కెనడాలో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
- కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
2 Comments