
క్రైమ్ మిర్రర్, తెలంగాణ డెస్క్ : 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఇటీవలే అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులంతా పరీక్షలకు సిద్ధం కావాలని చెప్పారు. శాఖలవారీగా భర్తీ చేయబోయే పోస్టులు ఎన్నో కూడా వివరించారు. సీఎం ప్రకటనతో ఉద్యోగ నోటిఫికేషన్లకు అధికారులు సిద్ధమవుతున్నారు. పోలీస్ శాఖ నుంచే తొలి ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
జోన్ల వారిగా ఉద్యోగాల ఖాళీల జాబితాను పోలీసు శాఖ ఉన్నతాధికారులు సిద్ధం చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి కసరత్తు మొదలు పెట్టింది. ఈనెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటివారంలో ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీస్ శాఖలో దాదాపు 18వేలకు పైగా ఖాళీలున్నట్లు గుర్తించారు.
Read More : హెల్మెట్ లేని పోలీసులకు ఫైన్ వేసిన ఏసిపి…!!
2018లో పోలీస్ శాఖ 16 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో ఎంపికైన వారి శిక్షణ పూర్తి కాగానే మరోమారు భారీ స్థాయిలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. త్వరలోనే పోలీస్ శాఖలో భర్తీలు పూర్తి చేస్తామని ఇటీవల హోంమంత్రి ప్రకటించారు. దీనికి తగ్గుట్టుగానే నియామక మండలి సిద్ధమైంది. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది. గత ఏడాది జూలైలోనే నియామకాలకు సంబంధించి ప్రకటన వస్తుందని భావించింది. చివరి నిమిషంలో ఉద్యోగ ప్రకటన వాయిదా పడింది. తాజాగా సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో నోటిఫికేషన్ రానుంది.
Read More : స్పీకర్ తో అధికార పార్టీ ఎమ్మెల్యే వాగ్వాదం.. తెలంగాణ అసెంబ్లీ గరంగరం
ఉద్యోగాలకు సంబంధించి శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమైయ్యాయి. ఖాళీల చిట్టాను సిద్ధం చేస్తున్నారు. ఉద్యోగ ప్రకటన చేయడానికి ఇతర శాఖలకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖ నియామక ప్రకటన చేయాలంటే ముందు టెట్ నిర్వహించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి ..
- మాడి మసైపోతావ్.. కేటీఆర్ కు సంజయ్ వార్నింగ్
- కెనడాలో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
- కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- ఇసుక క్వారీలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
- కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు .. కేటుగాళ్లపై ఉక్కుపాదం.!