
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ఈ ప్లాన్ వేసుండొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి నాటకాలకు తెర తీశారని ఎద్దేవా చేశారు. పీకే సూచనలతో కొత్త డ్రామాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. మరో 12 నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
Police : హెల్మెట్ లేని పోలీసులకు ఫైన్ వేసిన ఏసిపి…!!
సీఎం కేసీఆర్ ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు యశోద హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు ప్రకటించారు. అయితే ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు ముఖ్యమంత్రి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై జోరుగా చర్చ జరుగుతోంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ కు జ్వరం వచ్చిందని కొందరు బీజేపీ నేతలు కామెంట్ చేశారు. పీకే డ్రామాలో ఇదో స్క్రిప్ట్ అని సోషల్ మీడియోలో చర్చ జరిగింది. తాజాగా రేవంత్ రెడ్డి కూడా అవే కామెంట్లు చేయడం ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి ..
- మాడి మసైపోతావ్.. కేటీఆర్ కు సంజయ్ వార్నింగ్
- కెనడాలో ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
- తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర..
- ఇసుక క్వారీలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
- కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు .. కేటుగాళ్లపై ఉక్కుపాదం.!