
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భారత సంతతికి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఒంటారియో లోని జరిగిన రోడ్డుప్రమాదంలో భారత సంతతికి చెందిన ఐదుగురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే చనిపోయారు. వీరిలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
భారత కాల మానం ప్రకారం… శనివారం టోరంటో లోని ఒంటారియోలోవిద్యార్థులు తెల్లవారు జామున 3.45 నిముషాలకు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ధృవీకరించారు. కెనడాలోని విద్యార్థులు శనివారం టొరంటో సమీపంలో ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదుగురు మృతి చెందారు. మరొ ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
మృతి చెందిన విద్యార్థులలో.. హర్‌ప్రీత్ సింగ్ , జస్పిందర్ సింగ్ , కరణ్‌పాల్ సింగ్ , మోహిత్ చౌహాన్ , పవన్ కుమార్ గా గుర్తించారు. బాధిత కుటుంబాలకు సమాచారం చేరవేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. బాధితుల స్నేహితులను కలిసి, సహయక చర్యలను చేపట్టాలని అజయ్ బిసారియా ఆదేశించారు. అదే విధంగా.. ఈ ఘటనపై భారత హైకమిషనర్ అజయ్ బిసారియా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి …
- మాడి మసైపోతావ్.. కేటీఆర్ కు సంజయ్ వార్నింగ్
- కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- తెలంగాణ పోలీస్ శాఖలో కొలువుల జాతర..
- ఇసుక క్వారీలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
2 Comments