
- గంజాయి, గుట్కా, గుడుంబా నిర్మూలనకు ప్రజలు సహకరించాలి- ఏసీపీ గిరికుమార్
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆదేశాల మేరకు ఇంతేజార్ గంజ్ పీఎస్ పరిధిలోని సుందరయ్య నగర్ లో వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 72 మంది పోలీసులు 5 సెర్చ్ బృందాలుగా ఏర్పడి, 350 గృహాలను తనిఖీలు చేశారు. ద్విచక్ర వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడంతో 22 వాహనాలను సీజ్ చేశారు. అనుమతి పత్రాలు లేని వాహనాలు, గుట్కా గంజాయి అనుమానాస్పద వ్యక్తులపై పోలీసులు దృష్టి సారించారు.
Read More : మళ్లీ పంజా విసిరిన కోవిడ్.. చైనాలో లాక్ డౌన్
ఈ సందర్భంగా ఏసీపీ గిరికుమార్ మాట్లాడుతూ.. గంజాయి, గుట్కా, గుడుంబా, గ్యాంబ్లింగ్ (4G) నిర్మూలనకు ప్రజలు సహకరించాలని, ఏదైనా 4G గురించి సమాచారం ఉన్నట్లయితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకి సమాచారం చేరవేయాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఓటిపి లోన్ విషయాలలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వరాదని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని కాలనీ భద్రతకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇంతే జార్ గంజ్ సీఐ మల్లేష్, మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్, మట్టెవాడ సీఐ రమేష్, ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- హెల్మెట్ లేని పోలీసులకు ఫైన్ వేసిన ఏసిపి…!!
- స్పీకర్ తో అధికార పార్టీ ఎమ్మెల్యే వాగ్వాదం.. తెలంగాణ అసెంబ్లీ గరంగరం
- రేవంత్ రెడ్డికి పీసీసీ వేస్ట్ అన్న కోమటిరెడ్డి.. జంపింగ్ ఖాయమేనా?
- బీజేపీ గూటికి ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీ ?
- బీజేపీకి వెళ్లే యోచనలో తీగల? బుజ్జగిస్తున్న గులాబీ బాస్?
One Comment