
క్రైమ్ మిర్రర్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని ధర్మవరం,అయ్యవారిపేట ఇసుక క్వారీలని మైన్స్ ఏడి శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ధర్మవరం,అయ్యవారిపేట ఇసుక సొసైటీలలో అక్రమాలు జరుగుతున్నాయని,ఇసుక లోడింగ్ కు మనుషుల ద్వారా కాకుండా రాత్రి సమయాలలో పొక్లెయిన్, జెసిబిలను ఉపయోగించి టిప్పర్ల ద్వారా ఇసుకను డంపింగ్ చేస్తున్నారని మాదృష్టికి వచ్చిందని, మహిళా గిరిజన ఇసుక సొసైటీ సభ్యులు నిబంధనలను,షరతులను ఉల్లంఘించవద్దని హెచ్చరించారు.
నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోబడతాయని సూచించారు.
అనుసరించాల్సిన నిర్దేశిత సూచనలు జారీ చేసి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే ఇసుక సరఫరా జరిగేలా చూడాలని,స్టాక్ పాయింట్ల వద్దనుండి లారీలు బయటకు వెళ్లే ప్రదేశాలలో సిసి కెమేరాలను ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణకు లారీలలో ఓవర్ లోడ్ ఇసుకను పోయకుండా పర్యవేక్షించాలని టియస్ యండిసి అధికారులకు సూచించారు. రాత్రి సమయాలలో ఇసుక డంపింగ్ కానీ, లోడింగ్ కానీ చేపట్టకూడదని,టియస్ యండిసి అధికారులు ఇసుక క్వారీ మంజూరైన ఏరియాతో పాటు ఇసుక తీయడానికి లోతును ధృవీకరించాలని ఆదేశించారు.
Read More : బీజేపీకి వెళ్లే యోచనలో తీగల? బుజ్జగిస్తున్న గులాబీ బాస్?
పౌరులకు హాని కలిగించేలా ఎటువంటి కార్యకలాపాలు ఉండకూడదని, నిర్దేశించిన వే బిల్లులు తప్పనిసరిగా టియస్ యండిసి ద్వారా జారీ చేయబడాలని, సొసైటీలు టియస్ యండిసి ద్వారా మంజూరైన ఇసుకను ఇప్పటికే డంపింగ్ చేసిన ఇసుక, ఇంకా చేయవలసిన ఇసుకకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో ములుగు జిల్లా మైన్స్ ఏడి,టిఎస్ యండిసి పిఓ, వాజేడు తాహసిల్దార్ అల్లం రాజ్ కుమార్, విఆర్ఓ, రెవిన్యూ సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు .. కేటుగాళ్లపై ఉక్కుపాదం.!
- హెల్మెట్ లేని పోలీసులకు ఫైన్ వేసిన ఏసిపి…!!
- స్పీకర్ తో అధికార పార్టీ ఎమ్మెల్యే వాగ్వాదం.. తెలంగాణ అసెంబ్లీ గరంగరం
- రేవంత్ రెడ్డికి పీసీసీ వేస్ట్ అన్న కోమటిరెడ్డి.. జంపింగ్ ఖాయమేనా?
- బీజేపీ గూటికి ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీ ?