
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసనసభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే స్పీకర్ తో వాగ్వాదానికి దిగారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఈ ఘటన తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తిగా మారింది.
ప్రశ్నోత్తరాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతుండగా.. స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు మైక్ కట్ చేశారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతుంగా సభలో ప్రసంగాలు వద్దని, ప్రశ్నలేవైనా ఉంటే అడగాలని డిప్యూటీ స్పీకర్ సూచించారు. అయినప్పటికీ రసమయి పట్టించుకోకుండా మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. దీంతో షాకైన రసమయి డిప్యూటీ స్పీకర్ చర్యపై అసహనం వ్యక్తం చేశారు. సభలో కనీసం మాట్లాడే అవకాశం కూడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
Read More : ప్రగతి భవన్ వణికిపోతోందా? అమిత్ షా రాబోతున్నారా?
సభలో తనకు మాట్లాడే అవకాశమే రావడం లేదని ఆరోపించారు రసమయి బాలకిషన్. రాకరాక ఛాన్స్ వస్తే మైక్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే ఇంక ప్రశ్నలెందుకని నిలదీశారు. ప్రశ్నలన్నీ ఒక్కరినే అడగనిస్తే సరిపోతుంది కదా అని రసమయి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ.. సభ్యులు ప్రసంగాలతో కాలయాపన చేయకుండా అవసరమైన ప్రశ్నలను అడగాలని మాత్రమే తాను సూచిస్తున్నానన్నారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేస్తేనే సభ సజావుగా కొనసాగుతుందన్నారు. అనంతరం రసమయికి మాట్లాడే అవకాశం ఇవ్వడంతో సంవాదం సద్దుమణిగింది.
ఇవి కూడా చదవండి ..
- రేవంత్ రెడ్డికి పీసీసీ వేస్ట్ అన్న కోమటిరెడ్డి.. జంపింగ్ ఖాయమేనా?
- బీజేపీ గూటికి ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీ ?
- బీజేపీకి వెళ్లే యోచనలో తీగల? బుజ్జగిస్తున్న గులాబీ బాస్?
- మళ్లీ పంజా విసిరిన కోవిడ్.. చైనాలో లాక్ డౌన్
- వారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జంప్? మునుగోడుకు ఉప ఎన్నికే?