
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ సెగలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించాన్ని కొందరు సీనియర్లు బహిరంగంగానే వ్యతిరేకించడం అప్పట్లో కలకలం రేపింది. టీపీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధిష్టానంపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదవిని అమ్ముకున్నారంటూ ఇన్‌చార్జిపై కూడా దుమ్మెత్తిపోశారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులిచ్చి కార్యకర్తలకు ఏం సందేశం పంపుతున్నారని అధిష్టానాన్ని ప్రశ్నించారు.
అవకాశం దొరికితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు . కోమటిరెడ్డి బ్రదర్స్ . ఇటీవల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు రేవంత్‌తో సఖ్యతగానే ఉంటున్నారు. ఆయన చేపట్టిన దీక్షలకు హాజరవడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. అయితే ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.
Read More : వారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జంప్? మునుగోడుకు ఉప ఎన్నికే?
తాజాగా సొంత పార్టీ విధానాలపై మరోమారు అసమ్మతిని వెళ్లగక్కారు రాజగోపాల్ రెడ్డి. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకపోవడంతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని అన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే పదవులు ఇవ్వాలి కానీ టీడీపీ నుంచి వచ్చిన వారికి ఇస్తే ఏం లాభం అంటూ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లెవరో అధిష్టానానికి తెలియకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు.తనకేమీ రేవంత్ రెడ్డితో విభేదాలు లేవని.. అంతర్గతంగానూ ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. కానీ పార్టీని నమ్ముకుని ఉన్నోళ్లకు గుర్తింపు ఇవ్వలేదని.. ఇలాగే కొనసాగితే పాతతరం కాంగ్రెస్ నాయకులు పార్టీకి దూరమవుతారని ఆయన అన్నారు.కెపాసిటీ ఉన్నోళ్లకి పదవులు ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు.
పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడం వేస్త్ అనేలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. అంతా సర్గుకుంటుందనుకుంటున్న సమయంలో కోమటిరెడ్డి బాంబ్ పేల్చడం సెగలు రేపుతోంది. తాజా వ్యాఖ్యలతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఆయన ఢిల్లీకి వెళ్లి కమలం పార్టీ పెద్దలను కూడా కలిశారు. అయితే ఆయన పార్టీలో మాత్రం చేరలేదు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో ఆయన మళ్లీ ఆ వైపు చూస్తున్నారని అంటున్నారు.
Kcr : ప్రగతి భవన్ వణికిపోతోందా? అమిత్ షా రాబోతున్నారా?
బీజేపీ పెద్దలే కోమటిరెడ్డి చేరికను కావాలనే కొన్ని రోజులు ఆపారని.. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఏప్రిల్ 14న బండి సంజయ్ మలి విడత పాదయాత్ర మొదలు కానుంది. ఆ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తారని తెలుస్తోంది. ఆ సభలోనే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని అంటున్నారు, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా కోమటిరెడ్డి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికను దుబ్బాక, హుజురాబాద్ తరహాలో గెలిచి… వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి మార్గం సుగమం చేసుకోవాలన్నది కమలనాథుల స్కెచ్ గా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి ..
- బీజేపీ గూటికి ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీ ?
- బీజేపీకి వెళ్లే యోచనలో తీగల? బుజ్జగిస్తున్న గులాబీ బాస్?
- మళ్లీ పంజా విసిరిన కోవిడ్.. చైనాలో లాక్ డౌన్
- కాంగ్రెస్ పార్టీ ఖతమైనట్టేనా? రాహుల్ బాబా భవిష్యత్ ఏంటో?
2 Comments