
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్ పై మహేశ్వరం నియోజకవర్గంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గులాబీ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదనే అసంతృప్తిలో ఉన్న తీగల.. పార్టీ మారాలని చూస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. అయితే ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు తీగల. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో రాష్ట్రంలో మళ్లీ వలసలు మొదలు కానున్నాయని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలు కమలం గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.
Read More : కల్తీ పాల ముఠా గుట్టు రట్టు చేసిన ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు
తుమ్మలతో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. తీగలను బీజేపీలోకి రావాలని ఆ పార్టీ పెద్దలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే ఆయనకు మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా కమలం నేతలు ఆఫర్ ఇచ్చారని సమచారం. గతంలో తుమ్మలతో కలిసి తీగల టీడీపీలో పనిచేశారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే తీగలను కూడా తనతో పాటు బీజేపీలోకి తీసుకువెళ్లేందుకు తుమ్మల చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యేగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు.
ఆమెను ఎదుర్కొవాలంటే తీగల లాంటి బలమైన నాయకుడు అవసరమని గుర్తించిన బీజేపీ,, తీగల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని, తుమ్మలతో ఆయనతో మాట్లాడిస్తుందని చెబుతున్నారు. తీగల పార్టీలోకి వస్తే మహేశ్వరం నియోజకవర్గం ఒక్కటే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ప్రయోజనం ఉంటుందని తెలంగాణ బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారట. గతంలో జీహెచ్ఎంసీ మేయర్ గా పనిచేసిన తీగలకు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలో బలమైన అనుచరగణం ఉంది.
మరోవైపు తీగల పార్టీ మారాలని చూస్తుండటంతో అధికార పార్టీ కూడా అప్రమత్తమైందని తెలుస్తోంది, బలమైన నేతను వదులుకోకూడదనే ఉద్దేశంతో అతన్ని బుజ్జగిస్తున్నట్లు చెబుతున్నారు, సీఎం కేసీఆరే స్వయంగా తీగలతో మాట్లాడారని తెలుస్తోంది. అయితే మహేశ్వరం టికెట్ విషయాన్ని తేల్చాలని గులాబీ పెద్దలను తీగల అడిగారని చెబుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో మంత్రి సబితపై వ్యతిరేకత ఉందనే విషయం పీకే సర్వేలో తేలిందట. సొంత పార్టీ నేతలే ఆమెపై ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు.
Read More : కోర్టుల చుట్టు తిరిగి డబ్బు, సమయం వృధా చేసుకోవద్దు- ఎస్సై రామారావు
కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకే అమె ప్రాధాన్యత ఇస్తున్నారని పాత టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంగా ఉన్నారట. ఈ అంశాలను పరిశీలిస్తున్న కేసీఆర్… మహేశ్వరం టికెట్ ఇస్తామని కూడా తీగలకు చెబుతున్నారని తెలుస్తోంది. సబితను మండలికి పంపి తీగలను అసెంబ్లీకి పోటీ చేయించే యోచనలో కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరీ కేసీఆర్ బుజ్జగింపులకు కూల్ అయి తీగల కారు పార్టీలోనే ఉంటారా లేక కమలం గూటికి చేరుతారా..
ఇవి కూడా చదవండి ..
- మళ్లీ పంజా విసిరిన కోవిడ్.. చైనాలో లాక్ డౌన్
- వారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జంప్? మునుగోడుకు ఉప ఎన్నికే?
- ప్రగతి భవన్ వణికిపోతోందా? అమిత్ షా రాబోతున్నారా?
- కాంగ్రెస్ పార్టీ ఖతమైనట్టేనా? రాహుల్ బాబా భవిష్యత్ ఏంటో?
- సెమీస్ లో బీజేపీ ఘన విజయం .. 2024 మోడీదేనా?
One Comment