
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో జోష్ పెంచాయి. ఉత్తరాది రాష్ట్రాలలో కమల దళానికి ఇక తిరుగులేదని ఫలితాలు నిరూపించాయి. ఈ సంవత్సరం చివర్లో జరిగే కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, మాదే ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయంటున్నారు కమల నాధులు. ఇక బీజేపీ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలే అని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలే అధికారమే మోడీ,.షా ద్వయం ప్రధాన టార్గెట్ అంటున్నారు.
త్వరలోనే అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో మళ్లీ బీజేపీలోకి వలసలు జోరందకుంటాయని తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలకు అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.ఇప్పటికే 20 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మంతనాలు మొదలు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి సహా తెరాసలో అసమ్మతి నేతలు కూడా కమల దళంతో టచ్’లో ఉన్నారని అంటున్నారు.
Read More : ఉద్యోగ భర్తీ ప్రకటనపై నేతల హర్షం.. సీఎంకు కృతజ్ఞతలు
బీజేపీ జాతీయ నాయకత్వం తెలుగు రాష్ట్రాలలో యూపీ తరహలో , ‘డబల్ ఇంజిన్’ ప్రచారానికి శ్రీకారం చుడుతుందని, అంటున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే, అభివృద్ధి పరుగులు తీస్తుందని యూపీని ఉదాహరణగా చూపేందుకు కమల దళం ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసిందని, పార్టీ వర్గాల సమాచారం.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ,తెరాస నాయకత్వాన్ని ఒక విధంగా షేక్ చేశాయని తెలిసింది. బీజేపీ యూపీలో బొటాబొటి మెజారిటీ గెలిచినా ఉత్తారాఖండ్, గోవాలో కమల దళం ఓడి పోతుందని,ఒడి పొవాలనీ తెరాస నాయకత్వం భావించింది. అయితే, యూపీలో బీజేపీకి ఉహించిన దానికంటే భారీ మెజారిటీ రావడం, మొత్తం నాలుగు రాష్ట్రాలలో అధికారం నిలుపుకోవడంతో తెరాస నాయకత్వం ఒక విధంగా ఖంగు తిందని అంటున్నారు.
Read More : సహకార స్వాహా పై చైర్మన్ ప్రెస్ మీట్.. సమాచార హక్కు చట్టాన్ని కాలరాసే ప్రయత్నం
అన్నిటినీ మించి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడడంతో, ముఖాముఖి పోటీలో బీజేపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని తెరాస నాయకులు అంటున్నారు. తెరాస వ్యతిరేక ఓటు బీజేపీవైపు మొగ్గు చూపినా, బీజేపీ ప్రధాన అస్త్రం హిందుత్వ కార్డు పనిచేసినా మళ్ళీ మూడవ సారి అధికారంలోని రావాలనే తెరాస ముచ్చట తీరక పోవచ్చని, పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
- వారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జంప్? మునుగోడుకు ఉప ఎన్నికే?
- కాంగ్రెస్ పార్టీ ఖతమైనట్టేనా? రాహుల్ బాబా భవిష్యత్ ఏంటో?
- సెమీస్ లో బీజేపీ ఘన విజయం .. 2024 మోడీదేనా?
- కోర్టుల చుట్టు తిరిగి డబ్బు, సమయం వృధా చేసుకోవద్దు- ఎస్సై రామారావు
- కల్తీ పాల ముఠా గుట్టు రట్టు చేసిన ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు
2 Comments