
క్రైమ్ మిర్రర్, వరంగల్ జిల్లా ప్రతినిధి: జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు వర్ధన్నపేట ఎస్సై రామారావు సూచించారు. మార్చి 12వ తేదీన (ఎల్లుండి) సుబేదారి కోర్టు వద్ద జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో మరియు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.
వరంగల్ సీపీ తరుణ్ జోషి, వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం ఆదేశాల మేరకు కక్షిదారులతో పాటు ప్రజలకు లోక్ అదాలత్ పై అవగాహన కోసం వర్ధన్నపేట ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు మాట్లాడుతూ.. రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై తెలిపారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- కల్తీ పాల ముఠా గుట్టు రట్టు చేసిన ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు
- ఉద్యోగ భర్తీ ప్రకటనపై నేతల హర్షం.. సీఎంకు కృతజ్ఞతలు
- ఖుష్ మహల్ వద్ద ఖుషీ ఖుషీగా మహిళా దినోత్సవ వేడుకలు
2 Comments